అమ్మా.. లే.. ప్లీజ్.. వీడియో వైరల్

అమ్మా.. లే.. ప్లీజ్.. వీడియో వైరల్

ఇంటికొచ్చిన పిల్లలకి అమ్మ కనిపించకపోతే ఎంత గాభరా పడిపోతారు. అమ్మ కోసం ఇల్లంతా కలియతిరుగుతారు. అమ్మ పంచే ప్రేమ అమృతం కన్నా మిన్న.. అది మనుషుల్లోనే కాదు మృగాల్లోనూ ఉంటుందని నిరూపిస్తుంటాయి జంతువులు. అమ్మ చనిపోయిందని తెలియక అమ్మని లేపే ప్రయత్నం చేస్తోంది చిన్ని రైనో (ఖడ్గమృగం). వేటగాడి క్రూర దాహానికి అమ్మ బలైపోయిన విషయం తెలియక అమ్మ కోసం అల్లాడుతోంది. అమ్మ చుట్టూ తిరుగుతూ.. అమ్మ లేవట్లేదేంటని ఏడుస్తోంది. ఏం చేయాలో తెలియక అటు ఇటూ తచ్చట్లాడుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోను ఫారెస్ట్ అధికారి ప్రవీణ్ కశ్వన్ పోస్ట్ చేశారు. వేట ఎంత విధ్వంసకరమైనదో వీడియోను చూసైనా కనువిప్పు కలగాలని ట్వీట్ చేశారు. ఈ వీడియోను పలువురు రీ ట్వీట్ చేశారు. కాగా, చనిపోయిన ఖడ్గమృగం 2018 ఫిబ్రవరి సౌతాఫ్రికాలోని నేషనల్ పార్క్‌కు చెందినదిగా తెలుస్తోంది. వీటి దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆ కారణంగా వేటగాళ్లు రైనోలను చంపి వాటి దంతాలను తీసుకు వెళుతుంటారు. అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో రైనోలు కూడా ఉన్నట్లు జంతు సంరక్షణ అధికారులు వివరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story