నాన్నా మమ్మల్ని చంపొద్దు

ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్‌ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కులాంతర వివాహం చేసుకున్నందుకు…. కన్నతండ్రే తమను వేటాడుతున్నాడంటూ సాక్షి మిశ్రా ఆరోపిపిస్తోంది. దళితున్ని పెళ్లి చేసుకున్నందుకు తనను, తన భర్తను చంపేస్తారని ఆరోపించింది సాక్షి మిశ్రా. తండ్రి నుంచి తమను కాపాడాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

ఈమె పేరు సాక్షి మిశ్రా. ఉత్తరప్రదేశ్‌లోని బీదారి చేన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కుమార్తె. ఇటీవలే సాక్షి మిశ్రా . . అజితేష్ కుమార్ అనే దళితున్ని ప్రేమించింది. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. ఐతే, పెళ్లి ఇష్టం లేని తండ్రి తమను వేధిస్తున్నాడని ఆరోపిస్తోంది సాక్షి మిశ్రా. తన తండ్రి అనుచరులు నిత్యం తమను వెంబడిస్తున్నారని, చంపడానికి కూడా వెనుకాడడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇష్టపూర్వకంగానే తాను అజి త్‌ను పెళ్లి చేసుకున్నానని, ఇందులో ఎవరి ఒత్తిడి లేదని వివరించింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఇప్పటికే చాలా సార్లు ప్రయత్నించామని, ఇంకా పరిగెత్తే ఓపిక తమకు లేదని వాపోయింది…మరోవైపు… సాక్షమిశ్రా భర్త అజితేష్ కూడా తమకు ప్రాణభయం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దళితున్ని కావడం వల్లే తమను చంపడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు. ఎమ్మెల్యే బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు. ..

 

సాక్షి మిశ్రా ఆరోపణలపైఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా ఖండించారు. కూతురుకు హానీ చేయాలనే ఆలోచన తనకు కలలో కూడా రాదన్నారు. కూతురు ప్రేమ వివాహాన్ని తానెప్పుడూ వ్యతిరేకించలేదని, ఏజ్ గ్యాప్, సంపాదన గురించి తన బాధంతా అని చెప్పుకొచ్చారు. సాక్షి కంటే అజితేష్ 9 ఏళ్లు పెద్దవాడ ని, అతనికి సంపాదన కూడా పెద్దగా లేదన్న ఎమ్మెల్యే, ఒక తండ్రిగా కూతురు భవిష్యత్తు మంచిగా ఉండా లని కోరుకోవడం తప్పా అని ప్రశ్నించారు. ..

మరోవైపు, సాక్షి మిశ్రా-అజితేష్ కుమార్ విజ్ఞప్తిపై యూపీ పోలీసులు స్పందిం చారు. దంపతులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఐతే, సాక్షి-అజితేష్‌ ల ఆచూకీ తెలుసుకో వాల్సి ఉందని, అప్పుడే వారికి అవసరమైన భద్రత కల్పించగలమంటున్నారు పోలీసులు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *