టీఆర్‌ఎస్‌ పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ

టీఆర్‌ఎస్‌ పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ

నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం చెన్నాయిపాలెంలో టీఆర్‌ఎస్‌ పార్టీలోని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురికి గాయాలయ్యాయి. మఠంపల్లి మండలంలో చెన్నాయిపాలెం, వరదాపురం అనే రెండు గ్రామాలు ఉన్నాయి. అయితే.. చెన్నాయిపాలెంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన రెండు గ్రూపుల మధ్య పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒక వర్గానికి చెందిన భరత్‌నాయక్‌ సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. టీఆర్‌ఎస్‌కు చెందిన మరోవర్గం నాయకుడు ఓటమిపాలయ్యాడు. మరోవైపు.. చెన్నాయిపాలెం,వరదాయి గ్రామాలకు కలిపి టీఆర్‌ఎస్‌ నాయకుడు భుక్యా అశోక్‌ ఎంపీటీసీగా ఎన్నికయ్యాడు.

అయితే.. గెటుపొందిన ఎంపీటీసీ,ఓడిపోయిన సర్పంచ్‌ ఒక వర్గంలో ఉండగా..గెలిచిన సర్పంచ్ మరో వర్గంలో ఉన్నారు. వీరందరూ కలిపి వరదాయపురం ఎంపిటీసీ అనే వాట్సప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశారు. అయితే.. ఇందులో సర్పంచ్‌ వర్గీయులు కూడ ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఇరు వర్గాల వారు గ్రూప్‌ ఛాటింగ్‌లో బూతులు తిట్టుకుంటూ సందేశాలు పంపుకున్నారు. దీంతో.. ఒకరిపై ఒకరికి తీవ్రంగా ద్వేషం పెరిగింది. ఈనేపథ్యంలో..చెన్నాయిపాలెంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తితో మరో వర్గం వారు ఘర్షణ పడ్డారు. ఇది చిలికి చిలికి గాలివానలా మారి రెండు వర్గాలు కర్రలు,కత్తులులతో దాడిచేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఐదుగురిని హుజూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్తలు చోటు చేసుకోవడంతో పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story