TCS కు కోవిడ్ ఎఫెక్ట్..

TCS కు కోవిడ్ ఎఫెక్ట్..
టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కు ఈ ఆర్థిక సంవత్సరం కష్టకాలమేనంటోంది S&P రేటింగ్ ఏజెన్సీ.

టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS)కు ఈ ఆర్థిక సంవత్సరం కష్టకాలమేనంటోంది S&P రేటింగ్ ఏజెన్సీ. తాజాగా విడుదల చేసిన రిపోర్టులో టీసీఎస్ రానున్న 12-18 నెలల్లో ఆదాయం గణనీయంగా పడిపోతుందని హెచ్చరించింది. అయితే నెగిటీవ్ గ్రోత్ ఉండకపోయినా.. గత ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే గణనీయంగా పడిపోతుందని తెలిపింది. 2021 మార్చి 31కి ముగిసే ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ ఆదాయం 0-1 శాతం మాత్రమే పెరుగుతుందని అంచనా వేసింది. అయితే ముగిసిన ఆర్థిక సంవత్సరం అంటే 2020 మార్చి 31లో కంపెనీ అంతకుముందు కంటే 5.3శాతం గ్రోత్ రిపోర్ట్ చేసింది. కొత్త కాంట్రాక్టుల్లో ధరల ఒత్తిడి, రెన్యువల్స్, క్లయింట్లుగా ఉన్న కంపెనీల వ్యయాల తగ్గింపు వంటి అంశాలు TCS పై పడుతుందని S&P చెబుతోంది.

Tags

Read MoreRead Less
Next Story