వరుసగా 16 హిట్లిచ్చిన ఏకైక ఇండియన్ డైరెక్టర్..

వరుసగా 16 హిట్లిచ్చిన ఏకైక ఇండియన్ డైరెక్టర్..

సినిమా పరిశ్రమలో ఒకరి పేరు చెప్పగానే అనివార్యంగా మరొకరి పేరూ వినిపించడం అరుదు. అలాంటి అనివార్యతను తన సినిమాలతో క్రియేట్ చేసిన దర్శకుడు ఏ కోదండి రామిరెడ్డి.. కోదండ రామిరెడ్డి పేరు వినగానే ఆటో మేటిక్ గా చిరంజీవీ గుర్తొస్తాడు. చిరును ప్రేక్షకుల గుండెల్లో ఖైదీని చేసిన ఆ దర్శకత్వ మాయాజాలం గుర్తొస్తుంది.. ఒక్క చిరంజీవి మాత్రమే కాదు.. అందరు స్టార్ హీరోలతో మాస్ కే జోష్ వచ్చేలాంటి సినిమాలు చేసిన మాసివ్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి. వరుసగా 16 హిట్లిచ్చిన ఏకైక ఇండియన్ డైరెక్టర్.. ఇవాళ ఈ మోస్ట్ సక్సెస్ ఫుల్ అండ్ సూపర్ హిట్ డైరెక్టర్

శ్రీధర్, చంద్రమోహన్ నటించిన సంధ్య అనే సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు కోదండరామిరెడ్డి. అంతకు ముందు విక్టరీని ఇంటి పేరుగా మలచుకున్న వి మధుసూధనరావు వద్ద శిష్యరికం చేశారు.. తర్వాత దర్శక మాస్ మహరాజ్ రాఘవేంద్రరావు వద్దా శిష్యరికం చేశారు.. అలా సినిమాపై అనుభవం సంపాదించుకున్న తర్వాతే సంధ్యతో కోదండరామిరెడ్డి అనే ఈ దర్శక సూరీడు వెలుగులోకి వచ్చాడు..

అభిలాష తర్వాత కోదండరామిరెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో కమర్షియల్ సినిమా లెక్కలను బ్లాస్ట్ చేసేలా ఖైదీ వచ్చింది. మంచి కథను ఖచ్చితమైన కమర్షియల్ లెక్కలతో సినిమాగా మలిస్తే ఎలా ఉంటుందనే దానికి సమాధానంగా ఎప్పటికీ నిలుస్తుంది ఖైదీ. ఈ సినిమాతో అప్పటి వరకూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లోనే ఉన్న చిరంజీవి ఒక్కసారిగా ఆంధ్రుల అభిమాన కథానాయకుడయ్యారు.

కోదండరామిరెడ్డి అనగానే చిరంజీవి పేరు అనివార్యంగా వినిపించినా .. కేవలం చిరుకే పరిమితం కాలేదు.. ఇతర హీరోలతోనూ అదిరిపోయే హిట్స్ ఇచ్చాడు. బాలకృష్ణతో నారీ నారీ నడుమ మురారి లాంటి క్లాస్ సినిమా చేశాడు.. నాగార్జునకు ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అల్లరి అల్లుడు లాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ మాస్ హిట్ ఇచ్చాడు. అలాగే కమల్ హాసన్ తో ఒకరాధ ఇద్దరు కృష్ణుడు అంటూ కామెడీ హిట్ ఇచ్చారు. మొత్తంగా దర్శకుడిగా అందరు హీరోలతో, అన్ని రకాల సినిమాలూ చేసిన ఘనత ఆయన సొంతం..

కోదండరామిరెడ్డి సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ బాగా ఉన్నా.. సెంటిమెంట్ నూ అద్భుతంగా పండిస్తాడు.. అటు కామెడీకీ కొదవ లేకుండా చూసుకుంటాడు.. ఇక మరో విశేషం ఏంటంటే, ఆయనకు మ్యూజిక్ సెన్స్ ఎక్కువ.. అందుకే తన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమానూ మ్యూజికల్ హిట్ అయ్యేలా చూసుకున్నాడు.. ఈ విషయంలో కోదండరామిరెడ్డిపై రాఘవేంద్రరావు ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story