ఆయన వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు : కోమటిరెడ్డి

ఆయన వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు : కోమటిరెడ్డి

రాష్ట్ర నాయకత్వంపై సొంత పార్టీ నేత రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలు కాంగ్రెస్ లో అగ్గి రాజేస్తున్నాయి. పీసీసీ చీఫ్ వల్లే పార్టీ పరిస్థితి దారుణంగా మారిందన్న ఆయన వ్యాఖ్యలు పార్టీలో బిగ్ టాక్ మారింది. అయితే..రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి మాత్రం భిన్నస్వరం వినిపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్నారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తన ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటానని అన్నారాయన. కేసీఆర్ కుటుంబంలోనూ రాజకీయ అభిప్రాయ బేధాలు ఉన్నాయని...కేసీఆర్ కుటుంబ సభ్యులు వేర్వేరు పార్టీలో ఉన్నారని అన్నారాయన. అలాగే కాంగ్రెస్ నాయత్వంపై రాజగోపాల్ రెడ్డి రాజకీయ అభిప్రాయాన్ని చెప్పారని, అది తన అభిప్రాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పార్టీ అధిష్టానం కూడా రాజగోపాల్ రెడ్డి విమర్శలపై ఆగ్రహంతో ఉంది. అయితే..రాజగోపాల్ రెడ్డి మాత్రం తాను చేసిన విమర్శలపై వెనక్కి తగ్గటం లేదు. కేసీఆర్ తో ఫైట్ చేయాలంటే కేవలం డబ్బే కాదని..బీజేపీ లాంటి పార్టీ కూడా అవసరమని అయన భావిస్తున్నారు.

పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ విఫలం అయ్యారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలోనూ విమర్శించారు. పార్టీని సమర్ధవంతంగా నడిపించాలంటే తమకు పీసీసీ పదవి అప్పగించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే..పార్టీ అధిష్టానం కోమటిరెడ్డి బ్రదర్స్ కు పీసీసీ అధ్యక్షుడి పదవి ఇవ్వకపోటమే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహానికి కారణమని పార్టీలో చర్చ జరుగుతోంది. అటు రాజగోపాల్ మాత్రం కాంగ్రెస్ పార్టీ స్పందన చూసి తన వ్యాఖ్యలపై మరోసారి రియాక్ట్ అవుతానని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story