రూ.15,000 లోపు వేతనం ఉన్న ప్రతి ఉద్యోగికి రూ.6 లక్షల ఉచిత ఇన్సూరెన్స్..

రూ.15,000 లోపు వేతనం ఉన్న ప్రతి ఉద్యోగికి రూ.6 లక్షల ఉచిత ఇన్సూరెన్స్..

రిటైర్మెంట్ తరువాత ఆర్థిక భద్రతే లక్ష్యంగా వేతనంలో కొంత మొత్తాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌లో జమ చేస్తుంటారు. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో ఇది ఒకటి. దీని నిర్వహణ బాధ్యతలన్నీ ఈపీఎఫ్‌వో చూసుకుంటుంది. ఈపీఎఫ్ అకౌంట్‌తో మూడు రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ కవర్ అనేవి ఇందులో ఉంటాయి. ఇన్సూరెన్స్ కవర్ విషయానికి వస్తే.. ఈపీఎఫ్‌వో సబ్‌స్ర్కైబర్లకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను అందుబాటులో ఉంచింది. ఈ పాలసీ ఇతర పాలసీల మాదిరిగానే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రీమియం చెల్లించాల్సిన పనిలేదు. నెలకు రూ.15000లోపు వేతనం కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. రూ.6లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాలసిన అవసరం లేదు. కంపెనీయే బేసిక్ శాలరీలో 0.5 శాతం లేదా గరిష్టంగా రూ.75లను నెలకు పాలసీకి చెల్లిస్తుంది. ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం ఒక సంస్థలో 20 లేదా ఆపై సంఖ్యలో ఉద్యోగులు ఉంటే ఈపీఎఫ్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story