రక్తం కారుతున్నా డ్యాన్స్‌ ఆపలేదు

రక్తం కారుతున్నా  డ్యాన్స్‌  ఆపలేదు

బాలీవుడ్ అభిమానుల్లో ఎప్పటికీ నిలిచిపోయే పాట ఛయ్యా ఛయ్యా. ఈ పాటతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు నటి మలైకా అరోరా. ఈ సాంగ్ పెద్ద హిట్ సాధించి మలైకా కెరీర్‌ అమాంతం దూసుకుపోయేలా చేసింది. అయితే పాట తెర ముందు అంత అందంగా కనిపించడానికి తెర వెనుక మలైకా కష్టం చాలా పెద్దది. ఈ పాటను చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె చాలా తీవ్రంగా గాయపడ్డారట. పాట షూటింగ్ సమయంలో తను ఎదుర్కొన్న అనుభవాలను ఓ రియాల్టీ షోలో అభిమానులతో పంచుకున్నారు. "ఈ పాట చిత్రీకరణ మెుత్తం రైలు పైనే జరిగింది. ట్రైన్ పైనుంచి చాలా సార్లు పడిపోయాను. దీంతో మరోసారి నేను పట్టుతప్పకుండా ఉండడం కోసం నా నడుముకి తాడు కట్టారు. ఆ తాడు సహాయంతో డాన్స్ చేశాను. షాట్ పూర్తియైనా తర్వాత తాడు విప్పుతుంటే నడుము చూట్టూ గాయమయి రక్తమోడింది. దీంతో షూటింగ్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా కంగారుపడిపోయారు’ అని వివరించారు. ఈ పాట బాలీవుడ్‌లో ఓ సంచలనం. ఇప్పటి తరానికి బహుశా ఈ పాటతోనే హింది సినిమా పరిచయం అయి ఉంటుంది. ఇప్పటికీ పాటకున్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఈ పాటకు ఫరా ఖాన్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ చేయగా ఏ.ఆర్‌ రెహమాన్‌ స్వరాలందించారు. ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసినందుకు ఫరా ఖాన్‌కు ఫిలింఫేర్‌ అవార్డు లభించింది.

Tags

Read MoreRead Less
Next Story