విడాకులు తీసుకున్నా మాజీ భార్యపై కోపం చల్లారలేదు.. ఆమెపై..

విడాకులు తీసుకున్నా మాజీ భార్యపై కోపం చల్లారలేదు.. ఆమెపై..

వారం క్రితం విడాకులు తీసుకున్నప్పటికీ... అతడికి మాజీ భార్య మీద కోపం తగ్గలేదు. ఈ రోజు ఏకంగా ఆమెను హత్య చేయడానికి వెంటపడ్డాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ మాజీ భర్తను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ జారీగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లావణ్యను వేటకొడవలితో నరకడానికి వచ్చిన సాయికిరణ్‌ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. లావణ్య ప్రైవేటు జాబ్‌ చేస్తూ పిల్లలతో కలిసి యాదవ్‌ మిత్ర కాలనీలో నివసిస్తోంది. ఆయుధంతో సాయికిరణ్‌ కాలనీలో తిరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయినప్పటికీ పోలీసుల సహకారంతో లావణ్యను రక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story