పెళ్లీ.. పేరంటం.. ఏదైనా అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే.. ఎందుకంటే..

పెళ్లీ.. పేరంటం.. ఏదైనా అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే.. ఎందుకంటే..

చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుంటే ఏం చెబుతాం కానీ.. అమ్మా నాన్నని ఒప్పించి పెద్దలంతా మాట్లాడుకుని మంచి ముహూర్తం పెట్టించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఈ రోజు నుంచి మొదలు.. అక్టోబర్ 2 వరకు మంచి రోజులు లేవని పండితులు సెలవిస్తున్నారు. రాష్ట్ర పురోహిత విభాగం అధ్యక్షుడు శ్రీరామదుర్గం కుమారాచార్య పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట లలితా పీఠంలో ఇందుకు సంబంధించిన వివరాలు అందించారు. మూఢమి ప్రవేశంతో మూడు నెలల పాటు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదని అంటున్నారు.

ఈ రోజుల్లో గృహప్రవేశాలు కానీ, పెళ్లిళ్లు కానీ మరేవిధమైన శుభకార్యాలు చేయకూడదని చెబుతున్నారు. నిజానికి శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు ఉంటాయి. అయితే ఈ ఏడాది జులై ఆషామాసం కావడంతో శూన్యమాసం వచ్చిందన్నారు. అలాగే శ్రావణమాసంలో కూడా మూఢమి వచ్చిందని, సెప్టెంబర్‌లో వచ్చే భాద్రపదమాసం కూడా శూన్యమాసం కావడంతో ఆ రోజుల్లో శుభకార్యాలు నిర్వహించకూడదని అంటున్నారు. అందుచేత మంచి ముహూర్తం కోసం మూడు నెలలు ఆగాల్సిందే మరి.

Tags

Read MoreRead Less
Next Story