పీరియడ్స్ సమయంలో శానిటరీ న్యాప్‌కిన్స్‌కి బదులు మెన్‌స్ట్రువల్ కప్స్..

పీరియడ్స్ సమయంలో శానిటరీ న్యాప్‌కిన్స్‌కి బదులు మెన్‌స్ట్రువల్ కప్స్..

మహిళలకు ఇబ్బంది కలిగించే అంశం నెలసరి సమస్య. ఉద్యోగం చేసే మహిళకైతే మరింత కష్టం. న్యాప్‌కిన్‌తో వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకు వీలుగా మెన్‌స్ట్రువల్ కప్స్ వాడుకలోకి వస్తున్నాయి. వీటిని ఎక్కువ కాలం ఉపయోగించే వీలుంది. ఆరోగ్యపరమైన సమస్యలు సైతం ఎదురుకావు. పైగా కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం..

వీటిని దాదాపు పన్నెండు గంటల పాటు ఉపయోగించవచ్చు. ఇవి సిలికాజెల్, రబ్బరు, లేటెక్స్‌తో తయారు చేస్తారు. అందుకే పర్యావరణానికి హాని చేయవు. కొందరు పీరియడ్స్ సమయంలో టాంపూన్లను వాడుతుంటారు. ఇవి రక్తస్రావాన్నే కాదు.. యోని భాగంలోని సహజ ద్రవాలను పీల్చేస్తాయి. దాంతో ఆ ప్రాంతంలోని పీహెచ్ స్థాయిల్లో తేడా వస్తుంది. కప్స్‌తో అలాంటి ఇబ్బందులు ఎదురు కావు. శానిటరీ నాప్‌కిన్లు వాడిని తరువాత తిరిగి ఉపయోగించలేం. అదే కప్స్ అయితే ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుని వాడుకోవచ్చు. పైగా ఇవి ఎక్కువ రక్తస్రావాన్ని నిల్వ చేయగలుగుతాయి. సాధారణ న్యాప్‌కిన్ల వల్ల దద్దుర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కప్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు నిపుణులు.

Tags

Read MoreRead Less
Next Story