ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న లావణ్య లీలలు

ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న లావణ్య లీలలు

రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్‌ లావణ్య ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సొంత భూముల్ని పోగొట్టుకున్నవారు మీడియా ముందు ఏకరవు పెడుతున్నారు. వంశపారంపర్యంగా వచ్చిన భూముల్ని తన అధికార బలంతో డబ్బుకు ఆశపడి ఇతరుల పేరిటి చేసిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

కేశంపేట మండలం సంగెం గ్రామానికి చెందిన రైతు రఘుపతిరెడ్డి వారసత్వ భూమిని కొందరు ఫోర్జరీ చేసి ఇతరులకు అమ్మేశారు. రఘుపతి రెడ్డి దీనిపై కోర్డుకు వెళ్లాడు. కేసు కోర్టులో నడుస్తుండగానే అవతలివారు తహసీల్దార్‌ లావణ్యకు లంచం ఇచ్చి భూమిని తమపేరున రాయించుకున్నారు. ఇదేమిటని రైతు ప్రశ్నిస్తే పోలీసు కేసుపెడతానని బెదిరించినట్టు తెలిపారు బాధితులు.

మరో రైతు నాయక్‌ వారసత్వ భూముల్ని తమ అన్నదమ్ముల పేరిటి చేసి పాస్‌ బుక్‌ ఇవమని కోరగా లావణ్య 5 లక్షలు డిమాండ్‌ చేశారు. తాతల భూమి రికార్డుల్లో లేదని వేధించారు. చివరకు 4 లక్షలకు బేరం కుదుర్చుకుని ఒక్కరికే పాస్‌బుక్‌ ఇచ్చారు. మిగిలినవారికి త్వరలో ఇస్తామని 6 నెలలుగా తిప్పించుకుంటున్నారని బాధితులు అన్నారు. ఇప్పుడు తహసీల్దార్ లావణ్య అరెస్టు కావడంతో పనికాకపోగా తమ డబ్బులు కూడా పోయాయని ఆవేదన చెందుతున్నారు.

తహసీల్దార్‌ లావణ్య ఆరెస్టు కావడంతో బాధితులంతా కేశంపేట MRO కార్యాలయానికి తరలివస్తున్నారు. తమ పాస్‌ పుస్తకాలపై పరిస్థితి ఏమిటని అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు బాధితులు. పాత సమస్యలు పరిష్కారానికి కొత్త MRO రావాల్సిందే అంటున్నారు అధికారులు

Tags

Read MoreRead Less
Next Story