జగన్‌పై లోకేశ్ విమర్శలు..

జగన్‌పై లోకేశ్ విమర్శలు..

ముఖ్యమంత్రి జగన్‌పై మరోసారి ట్విట్టర్‌లో విమర్శలు చేశారు మాజీ మంత్రి లోకేష్. వైఎస్ హయాంలో సోలార్ విద్యుత్ యూనిట్‌ ఎంతకు కొన్నారో, చంద్రబాబు పాలనలో యూనిట్‌కి ఎంత ఖర్చు పెట్టామో చూడండంటూ లెక్కలు తీశారు. కనీస ఆధారాలు లేకుండా టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల 2వేల 636 కోట్లు అవినీతి జరిగిందని తేల్చడం ఏంటని ప్రశ్నించారు. గుడ్డ కాల్చి మీద వేయడంలో మీకు మీరే సాటి అంటూ జగన్‌పై సెటైర్లు వేశారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేదని, ఈ ఐదేళ్లలో మిగులు విద్యుత్తు సాధించామని లోకేష్ అన్నారు. 5 ఏళ్లలో 150కిపైగా అవార్డులు సాధించామని చెప్పారు. ఐదేళ్లలో 36 వేల కోట్ల పెట్టుబడితో 13వేల మందికి పైగా ఉద్యోగాలు లభించాయన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ పెట్టుబడులు అడ్డుకుని రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకురావొద్దని కోరారు లోకేష్.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పునఃసమీక్ష పేరుతో జగన్ ప్రభుత్వం చేస్తున్న తీరును తప్పుపట్టారు లోకేష్. ఈ ఒప్పందాల విషయంలో కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ రాసిన లేఖను మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. నీతి, నిజాయితీ పునాదిగా ఎదిగిన టీడీపీ అధినేత చంద్రబాబు గారి పై అవినీతి ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ ప్రయత్నం విఫలయత్నంగానే మిగిలిపోతుంది" అంటూ ట్వీటర్‌లో పోస్టులు పెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story