ఆన్ లైన్ బడి.. మారిన రూల్స్

ఆన్ లైన్ బడి.. మారిన రూల్స్
ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించి ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలనేదానిపై ఒక అభిప్రాయానికి వచ్చింది రాష్ట్ర విద్యాశాఖ.

ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించి ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలనేదానిపై ఒక అభిప్రాయానికి వచ్చింది రాష్ట్ర విద్యాశాఖ. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27 నుంచి ఉపాధ్యాయులందరూ పాఠశాలలకు హాజరు కావాలని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 1 నుంచి దూరదర్శన్, టీ-సాట్ ఛానల్ ద్వారా పాఠాలు ప్రారంభించాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. టీచర్లు ఆన్ లైన్ తరగతులకు సంబంధించిన ఈ-కంటెంట్, పాఠ్యాంశ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు విద్యార్ధులు ఇంటి నుంచి ఆన్ లైన్ తరగతులు అభ్యసించవలసి ఉంటుందని పేర్కొంది. గతంలో వెలువడిన ఉత్తర్వుల ప్రకారం ఉపాథ్యాయులు కనీసం 50 శాతం హాజరు కావలన్న ప్రస్తావన ఉంది. అయితే తాజా ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులందరూ పాఠశాలకు హాజరు కావలసి ఉంటుందని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story