సీఎం కేసీఆర్ ఆ విషయంలో ఎక్స్‌పర్ట్: ఎంపీ రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ ఆ విషయంలో ఎక్స్‌పర్ట్: ఎంపీ రేవంత్ రెడ్డి

పార్టీలకు అతీతంగా అసెంబ్లీ, సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలని నిర్ణయించారు అఖిలపక్షనేతలు. మాజీ ఎంపీ వివేక్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో.... సీఎం కేసీఆర్‌ నిర్ణయాలను తప్పుబట్టారు. ప్రజాధనాన్ని కేసీఆర్‌... వృథా చేస్తున్నారంటూ మండిపడ్డారు..

తెలంగాణ సచివాలయం, అసెంబ్లీ కూల్చివేతను నిరసిస్తూ మాజీ ఎంపీ వివేక్ ఆధ్వర్యంలో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పార్టీలకు అతీతంగా భవనాల కూల్చివేతను అడ్డుకోవాలని నిర్ణయించారు. కొత్త అసెంబ్లీ, సచివాలయం ప్రజలకు అవసరం లేదన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి. వాటి కూల్చడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేమని స్పష్టం చేశారు....

అసెంబ్లీని, సచివాలయాన్ని ఎందుకు కూల్చుతున్నారో.. ఎందుకు కొత్తవి కడుతున్నారో ఇంత వరకు కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పలేదన్నారు టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. తమకు మెజార్టీ ఉందని కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారాయన.ప్రజలను తప్పుదోవ పట్టించడంలో సీఎం కేసీఆర్ ఎక్స్‌ఫర్ట్ అంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. మూఢనమ్మకాలను ప్రజలపై రుద్దుతున్నారని ఆరోపించారు. సెక్షన్ 8 ప్రకారం భవనాలను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ దే అని అన్నారు రేవంత్ రెడ్డి..వ్యక్తి గత నమ్మకాలకు సీఎం కేసీఆర్‌ విలువ ఇస్తూ.. ప్రజల నమ్మకాన్ని పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు విపక్ష నేతలు.

Tags

Read MoreRead Less
Next Story