వర్జీనియాలో కాల్పులు..12 మంది మృతి

వర్జీనియాలో కాల్పులు..12 మంది మృతి

అమెరికాలో గన్ లైసెన్స్ ఏ రెంజ్ లో మిస్ యూజ్ అవుతుందో తెలిపే మరో ఘటన..ఎవడికో ఒకడికి తిక్క లేవడం..గన్ పట్టుకొని జనం మీద పడటం..ఇష్టమొచ్చినట్లు కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు తీయడం.. ఇలాంటి ఘటనలు అమెరికాలో కామన్..

వర్జీనియా రాష్ట్రంలోని వర్జీనియా బీచ్‌ నగరం కాల్పులతో దద్దరిల్లింది. ఇక్కడి మున్సిపల్ ఆఫీస్ లో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. కనిపించిన వారిని కనిపించినట్లు కాల్చి చంపాడు. మొత్తం 12 మందిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాడు..దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.. కానీ సాధ్యం కాకపోవడంతో కాల్చి చంపారు. కాల్పుల్లో పోలీసులు కూడా గాయపడ్డారు..

కాల్పులు జరిపిన ఉన్మాది అదే మున్సిపల్ భవనంలోని ప్రజాపనుల విభాగంలో సీనియర్ ఉద్యోగి. ఇతడు ఎప్పుడూ కోపం, అసంతృప్తితో రగిలిపోతుంటాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అంటే ఒక రకమైన సైకిక్ బిహేవియర్ అన్నమాట. ఇప్పుడు అదే ఉన్మాదంతో కాల్పులు జరిపి ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story