కస్టమర్లకు 'ఎస్‌బీఐ' వార్నింగ్..

కస్టమర్లకు ఎస్‌బీఐ వార్నింగ్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. మోసగాళ్ల బారిన పడకుండా ఖాతాదారులను అప్రమత్తం చేస్తోంది. మోసగాళ్లు అకౌంట్లలో నుంచి రూ.వేలకు వేలు కొట్టేస్తున్నారు. ఇందుకోసం ఎస్‌ఎంఎస్‌లు, కాల్స్, ఈమెయిల్స్ వంటివి పంపి ఖాతాదారులను మోసం చేస్తున్నారు. సడెన్‌గా మీఫోన్‌కి కాల్ వస్తుంది.. మీరు లాటరీ గెలుచుకున్నారు, మీ కార్డు బ్లాక్ అయ్యింది. మీకు స్పెషల్ బోనస్ వచ్చింది.. అంటూ ఇలా మెసేజ్‌లు పంపుతారు. అయితే ఇలాంటి మెసేజ్‌లకు స్పందించొద్దని కస్టమర్లను హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ.

ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్‌వర్డ్, పిన్, ఎంపిన్, ఓటీపీ వంటి వివరాలను ఎవరికీ చెప్పొద్దని బ్యాంక్ స్పష్టం చేసింది. బ్యాంకింగ్ లావాదేవీల కోసం బ్రౌజర్‌లో నేరుగా యూఆర్ఎల్‌ను టైప్ చేసి బ్యాంక్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసుకోవాలని ఎస్‌బీఐ తెలిపింది. ఏమైనా యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఈమెయిల్స్‌లో వచ్చిన లింక్‌లు వచ్చిన లింక్‌లు ఓపెన్ చేయవద్దని తెలిపింది. అకౌంట్ వివరాలు అప్‌డేట్ చేసుకుంటే రివార్డు పాయింట్లు ఇస్తామన్నా నమ్మొద్దని ఖాతాదారులను హెచ్చరిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story