ఏరియల్ సర్వే ద్వారా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేసీఆర్

ఏరియల్ సర్వే ద్వారా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. నీటిని విడుదల చేసిన తర్వాత తొలిసారి కేసీఆర్‌ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడిగడ్డకు వెళ్లి.. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు దాదాపు 140 కిలోమీటర్ల మేర సజీవంగా మారిన గోదావరిని నదిని హెలికాఫ్టర్‌ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించారు..

ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలు మొదలయ్యాయి.. దాదాపు 12 టీఎంసీల నీటిని మోటార్ల ద్వారా ఎగువకు ఎత్తిపోశారు అధికారులు.. దీనికి తోడు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.. క్షేత్రస్థాయి పర్యటనలో మేడిగడ్డ బ్యారేజ్‌, గోలివాడ పంప్‌హౌస్‌ను కేసీఆర్‌ పరిశీలించారు. అక్కడే గోదావరి మాతకు పూజలు చేసి.. వాయినం సమర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story