అంగరంగవైభవంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

అంగరంగవైభవంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. పలుజిల్లాల్లో మంత్రులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఇక పార్టీల ఆఫీసుల్లోనూ అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాలకు ఘన నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఎగువవేశారు. తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుందన్నారు..బంగారు తెలంగాణ ఇంకా ఎంతో దూరంలో లేదన్నారు కేటీఆర్.

సోనియాగాంధీ వల్లే తెలంగాణ సిద్ధించిందన్నారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉత్తమ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు.మిగులు రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు.

అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, శాసన సభ సిబ్బంది పాల్గొన్నారు.
జీహెచ్‌ఎంసీలో కార్యాలయంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ జాతీయ జెండాను ఎగరవేశారు.సంజీవయ్య పార్క్‌ ఎదురుగా ఉన్న ట్రాన్స్‌పోర్ట్‌ పార్కింగ్‌ యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టర్‌ విశ్వజిత్‌ పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ సంబరాలు అంబరాన్నంటాయి. పలు జిల్లాలో జరిగిన వేడుకలకు మంత్రులు హాజరయ్యారు.. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story