పదవతరగతి, డిగ్రీ అర్హతలతో హైకోర్టులో ఉద్యోగాలు..

తెలంగాణలోని సబార్డినేట్ కోర్టుల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ తదితర పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 1539.. పాత పది జిల్లాల్లోని జ్యుడీషియల్ కోర్టులతో పాటు, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు, సిటీ సివిల్ కోర్టు, సిటీ స్మాల్ కేసెస్ కోర్టు, స్పెషల్ జడ్జి ఫర్ ఎకనామిక్స్ అఫెన్స్ (హైదరాబాద్), స్పెషల్ జడ్జి ఫర్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, స్పెషల్ జడ్జి ఫర్ ట్రయల్ ఆఫ్ కేసెస్ కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. విభాగాల వారీగా ఖాళీలు: స్టెనోగ్రాఫర్ (గ్రేడ్3)-54, జూనియర్ అసిస్టెంట్ -277, టైపిస్ట్-146, ప్రాసెస్ సర్వర్-127, ఎగ్జామినర్-57, కాపీయిస్ట్-122, ఫీల్డ్ అసిస్టెంట్-65, రికార్డ్ అసిస్టెంట్-5, ఆఫీస్ సబార్డినేట్-686.
అర్హత: స్టెనోగ్రాఫర్‌కు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, ప్రాసెస్ సర్వర్‌కు ఎస్ఎస్‌సీ, మిగతా పోస్టులకు ఇంటర్/తత్సమాన ఉత్తీర్ణత. స్టెనోగ్రాఫర్/టైపిస్టులకు అదనంగా ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్/టైప్‌రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్‌తో పాటు కంప్యూటర్ ఆపరేషన్‌లో నాలెడ్జ్‌ను కలిగి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఏడోతరగతి లేదా తత్సమాన పరీక్ష. పదోతరగతి కంటే ఎక్కువ చదివిన వారు అనర్హులు. కార్పెంటర్, ఎలక్ట్రికల్ వర్క్స్, కుకింగ్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం. వయసు: 2019 జులై 1 నాటికి 18 నుంచి 34 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఫీజు: రూ.800/-ఎస్సీ/ఎస్టీలకు రూ.400/-.. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 4, వెబ్‌సైట్: http://hc.ts.nic.in

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *