తెలంగాణలో మరోసారి ఎలక్షన్ హీట్

తెలంగాణలో మరోసారి ఎలక్షన్ హీట్

నోటీఫికేషన్ ఎప్పుడొస్తుందో కూడా తెలియకముందే తెలంగాణలో మరోసారి ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది. కాంగ్రెస్ చప్పబడుతోందని భావిస్తున్న బీజేపీ ఇక టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే మైండ్ సెట్ క్రియేట్ చేసే పనిలో ఉంది బీజేపీ. అధికార పార్టీ విమర్శలకు ధీటుగా కౌంటర్లతో వాయిస్ మరింత రెయిజ్ చేసింది.

మున్సిపల్ ఎలక్షన్స్ కు పార్టీ నాయకుల్ని సిద్ధం చేసే పనిలో ఉన్న కేసీఆర్..కార్య‌క‌ర్త‌లు, జిల్లా అధ్య‌క్షులతో నిర్వ‌హించిన అంత‌ర్గ‌త స‌మావేశంలో బీజేపీ విజయాన్ని తేలిగ్గా తీసిపారేశారు. అసలు రాష్ట్రంలో బీజేపీ మనకు ప్రత్యామ్నాయమే కాదు పట్టించుకోవాల్సిన పని లేదంటూ ధీమా ఇచ్చారు. జడ్పీ ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఆ వెంటనే కేటీఆర్ కూడా రాష్ట్రంలో బీజేపీ లేదని నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారంటూ కమలం మీద మరో రాయి వేశారు. దీంతో బీజేపీ కూడా కౌంటర్ అటాక్ ప్రారంభించింది. మున్సిపల్ ఎన్నికల ముందు తమను పలుచన చేసి చూపించే పయత్నాలను తిప్పికొట్టేందుకు పార్టీ నేతలంతా వరుస పెట్టి కేసీఆర్, కేటీఆర్ పై ఎదురుదాడికి దిగారు.

అధికారమే లక్ష్యంగా నిర్దేశించుకున్న బీజేపీ..అన్ని ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటూ అసెంబ్లీ ఎన్నికల నాటికి పుంజుకోవాలని చూస్తోంది. తమ లక్ష్యంలో ఏ అవరోధాన్నైనా సీరియస్ గా తీసుకుంటోంది. జడ్పీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపించేలా ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో కేసీఆర్, కేటీఆర్ తమను చులకన చేసి చూపించటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ..తండ్రి కొడుకులవి అహంకార ప్రకటనలని విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ కు బీజేపీ భయం పట్టుకుందని అన్నారు.

టీఆర్ఎస్ నుంచి అగ్రనాయకులు పదే పదే బీజేపీని విమర్శిస్తుండటం కూడా తమకు మైలేజ్ అనే దిశగా కమలం నేతలు అభిప్రాయ పడుతున్నారు. అయితే..విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వటం ద్వారా జనంలోకి పార్టీని తీసుకెళ్లటం మరింత సులువు అవుతుందని భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story