మా తోటలో పండిన క్యారెట్లు.. ఈ వారం వంటలన్నీ వాటితోనే

మా తోటలో పండిన క్యారెట్లు.. ఈ వారం వంటలన్నీ వాటితోనే
షూటింగ్ లతో బిజీగా ఉండే తారలు తమ ఖాళీ సమయాన్ని ఇష్టమైన పనుల కోసం వెచ్చిస్తున్నారు. టాలీవుడ్ బ్యూటీ సమంత టెర్రస్ మీద

షూటింగ్ లతో బిజీగా ఉండే తారలు తమ ఖాళీ సమయాన్ని ఇష్టమైన పనుల కోసం వెచ్చిస్తున్నారు. టాలీవుడ్ బ్యూటీ సమంత టెర్రస్ మీద కూరగాయలు పండిస్తూ, వంటలు నేర్చుకుంటూ, నటనలో మరిన్ని మెళకువలు నేర్చుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. తాజాగా తన ఇంటిపై క్యారెట్ లను పండించిన సమంత ఈ వారమంతా క్యారెట్ స్పెషల్స్ చేస్తానని చెబుతోంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ వారం తాను చేసే మెనూలో క్యారెట్ జ్యూస్, క్యారెట్ పచ్చడి, క్యారెట్ హల్వా, క్యారెట్ వేపుడు, క్యారెట్ పకోడి, క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ సమోసా అని పోస్ట్ పెట్టింది.

Tags

Read MoreRead Less
Next Story