సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ

సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు మంగళం పాడుతున్నారు. ఎల్లుండి నుంచి L1, L2, L3 దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రేపు ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ఆలయాల్లో వీఐపీ ట్రీట్‌మెంట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం న్యాయస్థానంలో ఆ పిటిషన్‌ విచారణ కొనసాగుతోంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను ఏ ప్రాతిపదికన అమలు చేస్తున్నారని న్యాయస్థానం టీటీడీ అధికారులను ప్రశ్నించింది. అందుకు సంబంధించిన జీవోలు ఉంటే సబ్‌మిట్‌ చేయాలని ఆదేశించింది. మరోవైపు.. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే ఇందుకు కారణమని ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు. భగవంతుడి ముందు అందరూ సమానమంటూ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. పూర్తిస్థాయిలో పాలకమండలి ఏర్పాటైన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాలని తొలుత భావించినా... న్యాయ వివాదాలు, భక్తుల నుంచి వస్తున్న వ్యతిరేకతల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దుపై నిర్ణయం తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story