మరో మూడు కొత్త కార్లతో మార్కెట్లోకి టాటా మోటార్స్.. ఫీచర్లు చూస్తే..

మరో మూడు కొత్త కార్లతో మార్కెట్లోకి టాటా మోటార్స్.. ఫీచర్లు చూస్తే..

టాటా మోటార్స్ నుంచి మూడు కొత్త కార్లు మార్కెట్లోకి రానున్నాయి. వీటిని 2020 ఏడాది చివరికల్లా కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ మూడు కార్లు ప్రీమియం హ్యాచ్ బ్యాక్, 7 సీటర్ ప్రీమియం SUV, మైక్రో SUV కొత్త కార్లను ఇండియన్ మార్కెట్లోకి టాటా ప్రవేశపెట్టనుంది. మార్కెట్‌ని విస్తరించే దిశగా టాటా మోటార్స్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా టాటా మోటార్స్ అల్టోజ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్‌తో పాటు H7X (కోడ్ నేమ్) 7- సీటర్ SUV, H2X (కోడ్ నేమ్) మైక్రో-SUV మూడు కార్లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మరీ ఈ కార్లకు సంబంధించిన ఫీచర్లు ఎలా వున్నాయో ఓ సారి చూద్దాం..

టాటా అల్టోజ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్: టాటా ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా ఈ కారు డిజైన్ చేశారు. టర్బోఛార్జడ్ యూనిట్‌తో 1.2 లీటర్ కెపాసిటీ ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో ఈ కారు ధర (ఎక్స్ షోరూం) రూ.5.5 లక్షల నుంచి రూ.8.5 లక్షల వరకు ఉండనుంది.

H7X, 7-సీటర్ SUV కారు: ఈ ఏడాది జరిగిన జెనీవా మోటార్ షోలో ఈ కారు మోడల్‌ను ప్రదర్శించారు. 7- సీటర్ హెరియర్ ఇంటీరియర్ కోడ్ నేమ్ H7X గా ఉండగా 5- సీటర్ కెపాసిటీతో ఆకర్షణీయంగా ఉండనుంది. ఇతర డిజైన్ ఫీచర్లతో పాటు ఫ్రంట్ ఫేసియా ఒకేలా ఉండనుంది. 7- సీటర్ వెర్షన్‌తో పోలిస్తే ఇందులో మేజర్ విజువల్ ఒకటి తేడా ఉంటుంది. చూడ్డానిక కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఇందులో ఒక సీటు వరుస అదనంగా కూడా ఉంటుంది. 5-సీటర్, 7- సీటర్ వెర్షన్ SUV కార్ల మోడల్స్‌లో వీల్ బేస్ ఒకేలా ఉంటుంది. H7X వెర్షన్ కారులో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 170hp పవర్ ఉత్పత్తి చేస్తుంది. హెరియర్‌పై 140hp వరకు పవర్ అందుబాటులో ఉంటుంది. SUV పోర్టు పోలియోలో H7x కారుకు అదనంగా 6- స్పీడ్ ఆటోమాటిక్ గేర్ బాక్స్ ఉంటుంది. H7X కారు మెడల్ (Ex-షోరూం) ధర రూ.16 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు ఉంటుంది.

H2X Micro-SUV కారు: SUV స్టయిల్ కార్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. కొత్త కార్లు అన్నింటినీ టాటా మోటార్స్ ఒకేసారి లాంచ్ చేస్తుంది. పెట్రోల్ ఆధారిత ఉత్పన్నంగా వస్తున్న ఈ కారు ఎక్స్ షోరూం ధర ప్రకారం రూ.5.0 లక్షల నుంచి రూ.8.0 లక్షల వరకు ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story