వెయిట్ తగ్గించుకోకపోతే ఎన్నో సమస్యలు
.jpg)
* డయాబెటిస్ వచ్చే అవకాశం
* అధిక రక్తపోటు ప్రధాన సమస్య
* హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం
* పొంచి ఉన్న క్యాన్సర్ ముప్పు
వెయిట్ లాస్, ఇప్పుడీ మాట వరల్డ్ వైడ్‌గా విన్పిస్తోంది. బరువు తగ్గేందుకు అందరూ నానా కుస్తీపట్లు పడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ పరుగులు పెడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, అసలు మనం ఎందుకోసం బరువు తగ్గాలి ? వెయిట్ తగ్గకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ? వెయిట్‌లాస్ ప్రాధాన్యంపై ఓ కథనం. స్థూలకాయం.
ఈ సమస్య మన దేశానికి మాత్రమే పరిమితమైంది కాదు. యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న పెనుముప్పనే చెప్పాలి. ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చేసి కొవ్వు కరిగించుకుంటున్నారు.
వెయిట్ తగ్గించుకోకపోతే ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ప్రధానమైనది డయాబెటిస్. స్థూలకాయులకు, డయాబెటిస్‌కు దగ్గరి సంబంధం ఉందనే చెప్పాలి. కొవ్వు నిల్వలు విపరీతంగా పేరుకుపోవడంతో ఓవర్ వెయిట్ పెరుగుతారు. అలాంటి వాళ్లలో డయాబెటిస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్లలో కన్పించే మరో లక్షణం అధిక రక్తపోటు.
ఇది మరింత ప్రమాదకరం. దీని కారణంగా చెప్పాపెట్టకుండా హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది. ఊబకాయులకు క్యాన్సర్ ముప్పూ పొంచిఉంది. మహిళల్లోనైతే బ్రెస్ట్ క్యాన్సర్, యుటెరస్, సర్వైకల్, గాల్‌బ్లాడర్ క్యాన్సర్లు, పురుషుల్లో ప్రొస్టేట్, రెక్టమ్ క్యాన్సర్లు వచ్చే డేంజరుంది.
స్థూలకాయుల్లో కన్పించే మరో ఇబ్బంది ఆర్థరైటిస్. ఓవర్ వెయిట్ కారణంగా కీళ్లు, జాయింట్ల నొప్పులతో ఊబకాయులు అల్లాడతారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలే ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ వెయిట్‌లాస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఒళ్లు వంచి కసరత్తులు చేస్తున్నారు.
Published Date : Monday, 17/10/2011 4:45 PM IST