రియాల్టీ షో బిగ్ బాస్‌లో మరో సంచలనం

* ఎంట్రీ ఇవ్వనున్న స్వామి అగ్నివేష్
వివాదాలకు కేరాఫ్ అడ్రసైన రియాల్టీ షో బిగ్ బాస్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది. ఇందులో ఇప్పటికే 11 మంది అమ్మాయిలతో పాటు... బాలీవుడ్ బ్యాడ్ బాయ్ శక్తికపూర్ ఉండగా.. తాజాగా ఓ సన్యాసి ఇందులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయనెవరో కాదు. ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్.... చుట్టూ 40 కెమెరాలు.. ఇండోర్ డయాస్.. టేకుల్లేని షాట్లు.. బయటి ప్రపంచంతో సంబంధాలు కట్... ఇలా ఒకటికాదు రెండుకాదు.. మూణ్ణెల్ల పాటు నటిస్తూనే జీవించడం. వింటుంటేనే అశ్చర్యంగా ఉంది కదూ. కానీ ప్రముఖ రియాల్టీ షో బిగ్ బ్రదర్‌లో అచ్చంగా ఇదే జరుగుతుంది. ప్రస్తుతం ఈ రియాల్టీ షో ఐదో సిరీస్ నడుస్తోంది.
ఇందులో పాల్గొన్న వారిలో అనేక మంది ఎలిమినేట్ కాగా... 11 మంది అమ్మాయిలతో పాటు... బాలీవుడ్ బ్యాడ్ బాయ్ శక్తికపూర్ మాత్రమే షోలో కొనసాగుతున్నారు. తాజాగా వీరికి మరో సన్యాసి తోడయ్యారు. ఆయన మరెవరో కాదు.. ఎన్నో సామాజిక ఉద్యమాలను ముందుండి నడిపించిన స్వామి అగ్నివేష్‌య..ఈ షోలో పాల్గొనడం ద్వారా వచ్చే మొత్తాన్ని గర్ల్స్ సొసైటీకి విరాళంగా అందించాలన్నది అగ్నివేష్ సంకల్పమని.. ఆయన సన్నిహితుడు మను సింగ్ తెలిపారు. అయితే మాడ్రన్ హంగులకు మారుపేరుగా నిలిచే ఈ షోలో 72 ఏళ్ల ఈ సన్యాసి ఎలా రాణిస్తారన్నది ఆసక్తిగా మారింది.
Published Date : Tuesday, 8/11/2011 2:17 PM IST