Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
11-11-11 అదృష్టమా..? అరిష్టమా?...
AA

* యువతను ఊరిస్తున్న స్పెషల్ డే
* ప్రసవం కోసం మహిళల ఎదురుచూపులు.
* సంఖ్యాపరంగా సూపర్ అంటున్న న్యూమరాలజిస్టులు.
* అంత స్పెషల్ ఏం కాదంటున్న పురోహితులు.


పుట్టిన రోజు అందరికి జీవితాంతం గుర్తుండిపోయే రోజు . అలాంటి బర్త్ డే ఒక ప్రత్యేకమైన రోజున వచ్చిందంటే ఇంకెంత థ్రిల్లింగ్‌ గా ఉంటుంది. అలాంటి స్పెషల్ డేనే నేడు. ఒకే తేదిన ఆరు ఒకట్లు వచ్చిన ఈ అద్బుతమైన రోజున పుట్టిన వారికి సంఖ్యాపరంగా ఎంతో బావుంటుందంటున్నారు న్యూమరాలజిస్ట్‌లు. అయితే ఇదంతా న్యాచురల్‌గా జరిగితేనే అంటూ కండిషన్‌ పెడుతున్నారు. ప్రతిదానికి ఏదో ఇక వింతను జోడించడం... ప్రస్తుత సమాజంలో కామన్ అయిపోయింది. పుట్టిన రోజైనా ... పెళ్లిరోజైనా దానికి ఓ స్పెషల్ ఉండాలని కోరుకునే వారు వందలు. వందేళ్లకోసారి వచ్చే అలాంటి రోజే ఇవాళ. పదకొండో తేది.. పదకొండో నెల..

2011 వ సంవత్సరం. తేదీలో ఏకంగా ఆరు ఒకట్లు వస్తున్న ఈ రోజు జీవితంలో మరచిపోని రోజుగా ఉండాలని కోరుకుంటున్నారంతా. ఈ విధంగా రావడం వల్ల ఎలాంటి ప్రత్యేకతా ఉండదని పురోహితులు చెబుతున్నా.... న్యూమరాలజిస్టులు మాత్రం ఈ రోజు ఎంతో గొప్పదంటున్నారు. 11 నెంబర్ సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజని అలాంటి రోజున పుట్టిన వారంతా గొప్పస్థానాలకు చేరుకునే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. తమకు పుట్టబోయే పిల్లలకు ఏదో ఒక స్పెషల్ ఇవ్వాలని కోరుకునే తల్లి దండ్రులు లేకపోలేదు. వారికి 1-11-11 అదృష్టంగా కలిసివచ్చిందనే ఫీలవుతున్నారు.

అందుకే సిజేరియన్‌ చేయించుకునైనా ఇవాళే డెలివరీ కావాలని నిండు గర్భిణులు ఆశపడుతున్నారు. అయితే ఇదంత మంచి ఆలోచన కాదంటున్నారు నిపుణులు. సహజంగా పుట్టిన వారికే ఈ సంఖ్య కలిసి వస్తుందంటూ కండిషన్స్‌ అప్లై అని చెబుతున్నారు. మొత్తం మీద అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆ ఫ్యాన్సీ డే రానే వచ్చేసింది. ఇవాళ్టి రోజున ఏ అద్భుతాలు జరుగుతాయో వేచి చూడాలి మరి..

Published Date : Friday, 11/11/2011 10:24 AM IST
Related Articles
Gallery