హైదారాబాద్ ఇంటర్నేషనల్ వీక్ వెబ్‌సైట్‌ను ప్రారభించిన వాసుకి
హైదారాబాద్ ఇంటర్నేషనల్ వీక్ వెబ్‌సైట్‌ను మిస్ ఇండియా యూనివర్స్ వాసుకి సుంకవల్లి ప్రారభించారు. బంజారాహిల్స్‌లోని బ్యూటీపుల్ పీపుల్ బయోస్పా అండ్ సెలూన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మోడలింగ్‌పై ఆసక్తి వున్న యువతకు ఈ ఫ్యాషన్ వీక్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ భామ వెల్లడించింది. ఈ నెల 14 నుంచి 18 వరకు బేగంపేటలోని హోటల్ తాజ్ వివంతాలో ఫ్యాషన్ వీక్ నిర్వహిస్తామని బ్యూటీపుల్ పీపుల్ బయోస్పా అండ్ సెలూన్ సీఈఓ శ్రీదేవి రెడ్డి తెలిపారు. ఇందులో దేశంలోని ప్రముఖ డిజైనర్లు తమ ఫ్యాషన్ ఉత్పత్తులను ప్రదర్శిస్తారని చెప్పారు.
Published Date : Saturday, 10/12/2011 4:24 PM IST