ముగింపు దశకు చేరుకున్న బ్రిలియంట్ మైండ్స్ - 2011
* 30 వారాల పాటు అందరినీ అలరించిన క్విజ్ కాంపిటీషన్
* ఎందరో విద్యార్థుల్లోని ప్రతిభ వెలికితీసిన బ్రిలియంట్ మైండ్స్
టీవీ 5 అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బ్రిలియంట్ మైండ్- 2011 క్విజ్ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. 30 వారాల నుంచి సక్సెస్‌ఫుల్‌గా నడిచిన ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వచ్చింది. జయప్రకాశ్ నారాయణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో ఉత్కంఠగా సాగుతూ... గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. ఈ రాత్రి 9 గంటలకు జరిగే గ్రాండ్ ఫినాలేలో విజేత ఎవరో చూడొచ్చు.
Published Date : Tuesday, 27/12/2011 11:31 AM IST