దేశంతా థర్టీఫస్ట్ ఫీవర్
.jpg)
* పార్టీలకు ఎక్కడిక్కడ స్కెచ్‌లు
నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ... కొత్త ఆశయాలతో మదిలోని భావాలను తెలుపుకునేందుకు యూత్ సిద్ధమైంది. గ్రీటింగ్ కార్డ్స్‌తోపాటు పలు రకాల గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. యువత అభిరుచికి అనుగుణంగా నగరంలో మదిదోచే వెరైటీ గిఫ్స్ట్ అందుబాటులోకి వచ్చాయి. ఫ్రెండ్సంతా కలసి ఎంజాయ్ చేయాడానికి ఎన్ని అకేషన్‌లు వచ్చినా.. న్యూ ఇయర్ లాంటి సందర్భం రాదంటే అతిశయోక్తి కాదు. డిసెంబర్ థర్టీఫస్ట్ కోసం నెలరోజుల ముందునుంచే ప్లాన్ వేస్తుంటారు. ఇందుకు అవసరమైన గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్స్ పలు రకాల బహుమతులు సమకూర్చుకుంటారు.
న్యూ ఇయర్ స్పెషల్‌గా మగువలకు కావలసిన ఫ్యాషన్ ఆక్సెసరీస్ గిఫ్ట్‌లలో భాగమైపోయాయి. దీంతో ప్రత్యేకంగా రూపొందించిన లేడీస్ వాచేస్, ఫ్యాషన్ జువెల్లరీతో గిఫ్ట్ షాపులు కళకళలాడుతున్నాయి. అందమైన ఆకృతుల్లో రూపొందిచిన కళాత్మకమైన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విభిన్న కాంతులు విరజిమ్మే ఇంటీరియర్ థింగ్స్, ఇంటిని అందంగా తీర్చుదిద్దుకునేందుకు బ్యూటీఫుల్ టాయ్స్ విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రేమానురాగాలతో పంచుకునే శుభాకాంక్షల కొటేషన్స్‌తో కొన్ని గిఫ్ట్స్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.
నూతన సంవత్సరం.. నూతన ఆశయాలకు స్వాగతం పలికే.. న్యూ ఇయర్ 2012 కోసం.. అన్ని గిఫ్ట్ షో రూంలో స్పెషల్ కలెక్షన్‌ను అందుబాటులో ఉంచారు. సో ఇంకెందుకాలస్యం.. రెడీ టు హ్యాపీ న్యూ ఇయర్.
Published Date : Saturday, 31/12/2011 10:22 AM IST