2012 క్యాలెండర్ కోసం ముద్దుగుమ్మల సెక్సీ ఫోజులు
* న్యూ ఇయర్ కోసం కింగ్‌ఫిషర్ అధినేత సపరేట్ ట్రాక్
కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించడంలో కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాది సపరేట్ ట్రాక్. కార్పొరేట్ ప్రముఖులకు, పొలిటికల్ విఐపీలకు లేటెస్ట్ ఇంపోర్టెడ్ లిక్కర్‌ను కానుకగా ఇచ్చే ఆయన... ట్రేడ్‌మార్క్ క్యాలెండర్‌ను పంపిస్తుంటారు. హాట్ హాట్ అందాలతో కైపెక్కించే కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌కు మార్కెట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 2012 క్యాలెండర్ కోసం భారీ కసరత్తే చేశారు. ఫొటో షూట్ కోసం ముద్దుగుమ్మల ఎంపిక నుంచి ఈవెంట్స్ నిర్వహణ వరకు పలు దశల్లో పోటీలు నిర్వహించారు. అన్ని దశల్లో ప్రతిభ చూపిన అందాల భామలు తుది క్యాలెండర్‌లో చోటు సంపాదించారు.
Published Date : Saturday, 31/12/2011 6:08 PM IST