Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
పాశ్చాత్య పోకడలో భారత యువత
AA

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీయులు సైతం బేష్ అంటూ కితాబ్ ఇస్తుంటే.. మన యూత్‌ మాత్రం ప్రాచ్ఛాత్య పోకడలను అనుసరిస్తూ.. మన కల్చర్‌కు తూట్లు పోడుస్తోంది. ప్రేమ పేరుతో షికార్లు కొడుతూ.. విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అంతా అయ్యాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే.. భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ఫ్యాషన్‌హబ్‌గా మారుతున్న హైదరాబాద్‌ నగరంలో యువత.. మరింత ఫ్యాషనబుల్‌గా తయారవుతోంది.

సినిమా, టీవీల ప్రభావంతో ప్రాచ్ఛాత్య పోకడలను అనుసరిస్తున్నారు. హీరో, హీరోయిన్లలా తయారవుతూ.. లవర్స్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీంతో చదువులు అటకెక్కి భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతోంది. యువతీ,యువకులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పక్కనపెట్టి.. వెస్ట్రన్‌ కల్చర్‌కు అరువులు చాస్తున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం తమ పిల్లలను పట్నం పంపిస్తే.. వారి ఆశలను అడియాశలు చేస్తూ.. ప్రేమ పేరుతో విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు.

ప్రస్తుతం నగరంలో ఏ గళ్ళీలో చూసినా లవర్సే దర్శనమిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో ట్యాంక్‌బండ్, నక్లెస్‌రోడ్‌తోపాటు పార్క్‌లు, బస్టాండ్లు, సినిమా ధియేటర్లు, చివరికి దేవాలయాల్లోనూ జంటలుగా దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా ఇందిరాపార్క్‌, సంజీవయ్యపార్క్‌, దుర్గం చెరువు, బొటానికల్ గార్డెన్‌లలో ఎక్కడ చూసినా ప్రేమపక్షులే కనిపిస్తున్నాయి. మరోవైపు లవర్స్‌ పేరుతో కొన్నిచోట్ల అసాంఘిక కార్యకలాపాలు సైతం జరుగుతున్నాయి. దీంతో కాస్త సేద తీరుదామని పార్కులకొచ్చేవారికి చూడరాని సీన్‌లు కనిపిస్తున్నాయి.

యువత ఇలా పెడదోవ పట్టడానికి తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమని సంప్రదాయ వాదులు గగ్గోలు పెడుతున్నారు. విదేశీయులు మన సంప్రదాయాల పట్ల ఆకర్శితులవుతుంటే.. మనం మాత్రం వెస్ట్రన్‌ కల్చర్‌ మోజులో పడి ఇండియన్‌ కల్చర్‌ను చిన్నచూపు చూడటం.. చాలా ప్రమాదకరమని సంప్రదాయవాదులు అంటున్నారు.

Published Date : Thursday, 12/1/2012 4:09 PM IST