ఫ్యాషన్ హబ్‌గా హైదరాబాద్...

ఫ్యాషన్ హబ్స్‌గా పేరొందిన ముంబై, బెంగళూర్, ఢిల్లీ, సరసన మన భాగ్యనగరం చేరింది. మెట్రో సిటీస్‌కు ధీటుగా ఫ్యాషన్ వీక్ నిర్వహించి... మేమూ తక్కువ తినలేదని నిరూపించుకుంది. అంతే కాకుండా... వివిధ ప్రాంతాలకు చెందిన డిజైనర్స్‌ను ఏకం చేసి.. మూడు రోజుల పాటు వింటర్ ఫెస్టివల్ నిర్వహించింది. ఫ్యాషన్ ప్రపంచంలో అగ్రపథంలో దూసుకుపోయేందుకు మేమూ రెఢీ అంటూ సవాల్ విసురుతోంది. ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే మొదట మూడు ప్రాంతాల పేర్లు మాత్రమే వినిపించేవి. అయితే.. ఇప్పుడా పరిస్థితి మారింది. నేను సైతం అంటూ మన హైదరాబాద్ కూడా ఫ్యాషన్ రంగంలో వడివడిగా ముందుకుపోతోంది. ఫ్యాషన్ రంగాన్ని శాసించేందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ మూడు రోజుల పాటు హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ 2010 పేరిట ఈవెంట్ నిర్వహించింది. దేశంలోని ప్రముఖ మోడల్స్‌ను ర్యాంప్‌పై క్యాట్ వాట్ చేయించి ఔరా అనిపించింది మన భాగ్యానగరి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 15 మంది ఢిజైనర్లు ఈ ఫ్యాషన్ వీక్‌లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ట్రెడిషనల్ వేర్, ఎథ్నిక్ వేర్, పార్టీ వేర్... క్యాజువల్ వేర్.. ఇలా డిఫరెంట్ థీమ్ కలెక్షన్స్ ప్రదర్శించారు. కలెక్షన్స్‌తో రెడీ అయిన ముద్దుగుమ్మలతో కొరియోగ్రాఫర్ అనుపమ వర్మ క్యాట్‌వాక్ చేయించారు. హైదరాబాద్ ఫ్యాషన్ ఇండస్ట్రీ మెయిన్ ఫ్లాట్ ఫాం గా మారుతుందని ఆయన చెబుతున్నారు. ఇక వీరి విషయం పక్కన బెడితే... అందమైన భామలు లేత మెరుపు తీగల్లా ర్యాంప్‌పై తళుక్కున మెరిశారు. అంతేనా... తమ అంద చందాలతో ఆహుతులను మైమరిపించారు. బాలీవుడ్ భామలు సైతం క్యాట్‌వాక్‌తో కేకపుట్టించారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే... నేనేం తక్కువ తిన్నానా అంటూ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పెళ్లి కూతురి గెటప్‌లో అదరగొట్టింది. ప్లేయర్‌ననే సంగతి మరిచిపోయి క్యాట్‌వాక్‌తో అలరించింది. అయితే... మూడు రోజులు గ్రాండ్ ఈవెంట్ నిర్వహించినా... హైదరాబాదీ మోడల్... హైదరాబాదీ డిజైనర్ ఫ్యాషన్ వీక్‌లో లేకపోవడం నగర వాసులను వెక్కిరించింది.