మగాళ్లకూ గర్భనిరోధక సూదిమందు !

* కండోమ్స్‌కు ప్రత్యామ్నాయం
* ఒక్కసారి తీసుకుంటే 2 నెలలు హ్యాపీ
* ఎడెన్‌బర్గ్ వర్సిటీ సైంటిస్టుల కృషి
* 200 జంటలపై పరిశోధనలు
* 20 మిలియన్ల నుంచి సున్నాకు..
పెళ్లి.. వెంటనే పిల్లలు.. ఇంతేనా జీవితం? మ్యారేజ్ అయ్యాక కొంతకాలం ఎంజాయ్ చేయాలి కదా ! ఇలా అనే కొత్త జంటల సింపుల్ సెలక్షన్.. కండోమ్స్. ఇప్పుడా బాధ కూడా లేకుండా దానికి ఆల్టర్‌నేషన్ వచ్చేసింది. మగాళ్లకు అదే బెటరంటున్నారు సైంటిస్ట్‌లు కూడా. ఇంతకీ ఆ 'అది' ఏంటి ? సెక్సువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేద్దామని కోరికున్నా..ఎక్కడ పిల్లలు పుట్టేస్తారేమోనన్న భయం చాలా జంటలకు ఉంటుంది. సిటీల్లో ఉండేవాళ్లకు కొన్ని సేఫ్టీ మెథడ్స్ తెలిసినా..గ్రామాల్లో వారికి మాత్రం కొంచెం కష్టమే.
అయినా కండోమ్స్ లాంటి వాటిని ఉపయోగించడానికి కొందరు ఇష్టపడరు. అందుకే అలాంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా కాలం నుంచి దీనికి ఆల్టర్‌నేషన్ కోసం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో ఇప్పుడు చెప్పుకోదగ్గరి ఓ సూదిమందు.. ఒక్కసారి ఈ సూదిమందు తీసుకుంటే చాలు..ఇక రెండు నెలలపాటు హ్యాపీ. ఇంతకుముందు ఈ వ్యవధి...వారం రోజులు ఉండేది. కాని తాజా పరిశోధనల్లో ఈ గ్యాప్‌ని రెండు నెలలకు పెంచగలిగారు శాస్త్రవేత్తలు. సో, సంతానం వద్దనుకునేవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని భరోసా ఇస్తున్నారు ఎడెన్‌బర్గ్ వర్సిటీ సైంటిస్టులు.
200 జంటలపై పరిశోధనలు నిర్వహించారు. ఈ సూదిమందులో వాడే హార్మోన్ల మిశ్రమం వల్ల.. వీర్యకణాల సంఖ్య చాలావరకూ తగ్గిపోయినట్లు గుర్తించారు పరిశోధకులు. ఈ ప్రయోగ పరీక్షల్లో రెండు పద్దతులు ఫాలో అయ్యారు. ఇది- మిల్లీలీటర్‌లో ఉండే 20 మిలియన్ల వీర్యకణాలను సున్నాకు చేర్చుతుందంటున్నారు ఈ శాస్త్రవేత్తలు. కాకపోతే .. ఇంకా మరింత రీసెర్చ్ జరిగితే.. కచ్చితంగా కాలవ్యవధిని గణనీయంగా పెంచొచ్చన్నది వీళ్ల ధీమా. ఏదైతేనేం.. పిల్లలు అప్పుడే వద్దనుకునేవాళ్లకు మాత్రం ఇది స్వీట్ న్యూసే.
Published Date : Monday, 7/2/2011 7:24 PM IST