అతిగా టీవీచూడటం వలన అల్పాయుష్షు.

* గంట టీవి వీక్షణంతో 22 నిమిషాలు తగ్గనున్న జీవితకాలం
* ఒక సిగరెట్ తాగితే కలిగే నష్టానికి ఇది రెట్టింపు.
* 15 నిమిషాల వ్యాయామం 3 సంవత్సరాలు జీవితాన్ని పెపొందిస్తుంది.
* వారానికి 92 నిమిషాల వ్యాయామం 14 శాతం జీవితాన్ని పెంపొందింస్తుంది.
* 6 గంటల టీవీవీక్షణం మీ ఐదు సంవత్సరాల జీవితాన్ని మింగేస్తుంది
మీరు అతిగా టీవీ చూస్తున్నారా.. అయితే జాగ్రత్త .. ఒక గంట టీవీ చూడడం మీ 22నిమిషాల జీవితకాలాన్ని హరించివేస్తోంది. ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజం. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా...అయితే ఈ స్టోరి చూడండి. టీవీ ప్రతిమనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. ఒకప్పుడు సరదాకోసం టివి చూడడం....ఇప్పుడు వ్యసనంలా మారింది. అది ఎంతగా అంటే మనుషుల మధ్య దూరాన్ని పెంచేంతగా .
కుటుంబసభ్యులతో మాట్లాడడం కంటే .. టీవీతో కాలక్షేపమే ఎక్కువవుతోంది ఈ రోజుల్లో. అయితే అతిగా టీవి చూడటం వల్ల అనర్దాలు ఎక్కువుతున్నాయని ఓ బ్రటీష్ జర్నల్ సర్వేలో తేలింది. ఇది ఎంత భయంకరంగా తయారైందంటే .. గంట టీవీ చూడటం వల్ల జీవితకాలంలో 20 నిమిషాలు కోల్పోయే ప్రమాదముంది. ఇది ఒక సిగరెట్ తాగడంవల్లే వచ్చే నష్టం కన్నా రెండు రెట్లు ఎక్కువ .
6 గంటలు టీవీచూడటం వల్ల 5 సంవత్సరాల ఆయుష్షు తగ్గుతుందని అందులో వెల్లడైంది. అయితే ప్రతిరోజు 15 నిమిషాలు వ్యాయామం చేసేవారి జీవితకాలం 3 సంవత్సరాల పెరుగుతోంది. అలాగే వారానికి 92 నిమిషాల వ్యాయామం 14 శాతం ఆయుష్షును పెంచుతోంది. సో బికేర్ ఫుల్...టివి చూడడం ఎంత తగ్గిస్తే అంత ఎక్కువ కాలం బతకవచ్చు.
Published Date : Tuesday, 16/8/2011 6:49 PM IST