లావుతగ్గాలంటే నీళ్లు తాగాల్సిందే

* అద్భుతమైన కెటలిస్ట్ గా వాటర్
* రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగితే కొవ్వు మటుమాయం
* నీరు లేకపోతే మందకొడిగా కిడ్నీ పనితీరు
* నీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యం
మీరు లావుగా ఉన్నారా... ఒళ్లు తగ్గించుకోవడానికి జిమ్ ల చుట్టూ తిరుగుతున్నారా..? లావు తగ్గడానికి మీకో ఈజీ మార్గం చెప్పమంటారా...? నీళ్లు ఎక్కువగా తాగితేచాలు, ఫ్యాట్ కంటెంట్ కరిగిపోతుందట. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం... లావుగా ఉండటానికీ, నీళ్లు ఎక్కువగా తగకపోవడానికీ సంబంధం ఉన్నదా? తరచూ నీళ్లు తాగేవారు లావెక్కరా..? వినడానికి ఇవన్నీ వింతగా కనిపించవచ్చు.
కానీ ఇదంతా నిజమే అంటున్నారు శాస్త్రవేత్తలు. రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగేవారిలో కొవ్వు పేరుకుపోదనీ, దీంతో నాజుకూగా ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయడంలో నీరు ఓ అద్భుతమైన కెటలిస్ట్ గా పనిచేస్తోందట. నీళ్లు ఎక్కువగా తాగే అలవాటుంటే, సహజంగానే ఎక్కువగా ఘనాహారం లోపలకు పోదు.
దీంతో శరీరంలో నిల్వఉన్న కొవ్వు పదార్ధాలు కరగడం ద్వారా విడుదలయ్యే శక్తినే శరీరం ఉపయోగించుకుంటుంది. ఫలితంగా సన్నబడతారు. వ్యాయామం చేసేవారు రోజుకు 8 గ్లాసుల కంటే ఎక్కువ వాటరే తాగాలట. తగినంత నీరు శరీరంలో లేకపోతే కిడ్నీ ఫంక్షన్ సరిగా ఉండదు. కిడ్నీలు మొరాయిస్తే, ఆ పనిభారం కూడా లివర్ మీద పడుతుంది. లివర్ చేసే ముఖ్యమైన ఫంక్షన్స్ లో కొవ్వు పదార్ధాలను కరిగించి శక్తిగా మార్చడం.
కిడ్నీ పని వచ్చి మీదపడటంతో లివర్ తన పనిని తగ్గించుకుంటుంది. దీంతో కొవ్వు పదార్ధాల జీర్ణ ప్రక్రియలో వేగం తగ్గుతుంది. ఫలితంగా కొవ్వు ఒక పట్టాన కరగదు. దీంతో లావుతగ్గరు. అదే నీరు ఎక్కువగా తీసుకుంటే ఈ ఇబ్బంది ఉండదు. అందుకే నీళ్లు ఎక్కువగా తాగే అలవాటు ఆరోగ్యానికి అన్నివిధాలా మేలని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.
Published Date : Thursday, 25/8/2011 3:04 PM IST