స్మోకింగ్‌తో డేంజర్

* పొగతాగే వాళ్లలో గుండె జబ్బులు ఎక్కువ
* కెనడా సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడి
* కెనడా సైంటిస్టుల పరిశోధనలు
* స్మోక్ చేసే వాళ్లకు త్వరగా గుండెపోటు
* విపరీతంగా పొగతాగితే డేంజర్
* స్మోకింగ్ మానేస్తేనే ఆరోగ్యం అంటున్న సైంటిస్టులు
మీకు స్మోక్ చేసే అలవాటు ఉందా ? సిగరెట్లు బాగా తాగుతారా ? అయితే, ఇప్పుడు చెప్పబోయేది మీ కోసమే. మీరు పీల్చే ఒక్కో పఫ్ మీ లైఫ్ టైమ్‌ను తగ్గిస్తుంది. అంతేకాదు పొగతాగని వారితో పోలిస్తే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదముంది. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగేవాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్లందరికీ ఓ బ్యాడ్ న్యూస్. స్మోక్ చేయడం వల్ల గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదముంది.
కెనడా సైంటిస్టులు చేసిన స్టడీలో ఎన్నోఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. స్ట్రోక్ వచ్చిన 982 మంది పేషెంట్లను పరిశీలించగా అందులో 264 మంది పొగతాగేవాళ్లు ఉన్నారు. స్మోక్ చేసే వాళ్లలో హార్ట్ ఎటాక్‌కు గురైన పేషెంట్ల ఏజ్ 58 కాగా, సాధారణ వ్యక్తుల సగటు వయసు 67 ఏళ్లు. పొగతాగటం వల్ల రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవుతుందని పరిశోధకులు తెలిపారు. ఇక విపరీతంగా స్మోక్ చేస్తే పరిస్థితి మరింత విషమిస్తుందని హెచ్చరించారు. చూశారుగా...పొగతాగేవాళ్లు హార్ట్ ఎటాక్ తప్పించుకోవాలంటే స్మోకింగ్ మానేయడం ఒక్కటే మార్గం.
Published Date : Friday, 7/10/2011 2:30 PM IST