Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఫిట్‌నెస్ కోసం కొత్త వ్యాయామం
AA

* రోజుకో గంట బురదలో పరుగు
* విదేశాల్లో క్రేజీ ఎక్సర్‌సైజ్‌గా మడ్‌ రన్‌
* పోటా పోటీగా మడ్‌ రన్ రేసులు


ఫిట్‌నెస్ కోసం జిమ్ముల చుట్టూ చక్కర్లు కొడుతున్నారా? యోగసనాలు వేసేందుకు నానా పాట్లు పడుతున్నారా? మీ లాంటి వారి కోసమే బురద ఎక్సర్‌సైజ్ అందుబాటులోకొచ్చింది? ఇదేంటి వింతగా బురద వ్యాయామం అనుకుంటున్నారా? ఇంకెందుకు లేటు ఈ స్టోరీ చూడండి.

ఇదేంటి వీళ్లకేమైనా పిచ్చి పట్టిందా? బురదలో పరుగులు తీస్తున్నారు అనుకుంటున్నారా? చూడ్డానికి బురదలో ఆటలాడుకుంటున్నట్లు కనిపిస్తున్నా...వీళ్లు చేస్తున్నది ఎక్సర్‌సైజ్. రోజుకో గంట ఇలా బురదలో పరిగెడితే చాలు చక్కని శరీర సౌష్టవం మీ సొంతం. విదేశాల్లో ఇప్పుడిదే క్రేజీ ఎక్సర్‌సైజ్. ఫారిన్‌లో మడ్ రన్ పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతున్నాయి. బురదలో రకరకాల విన్యాసాలు చేస్తూ ఫిట్ నెస్ ప్రియులు తెగ సందడి చేస్తున్నారు.

మొదటి మడ్ రన్ రేసు యూరప్‌లో జరిగింది. ఇది క్రమంగా అమెరికాతో పాటు ఇతర దేశాలకూ వ్యాపించింది.
బురదలో పరిగెట్టడం ఒక కోర్సుగా కూడా మారింది. దీంతో విదేశాల్లో ఎక్కడికక్కడే మడ్ రన్ సెంటర్లు వెలుస్తున్నాయి. లక్షల్లో ఔత్సాహికులు బురదలో పరిగెడుతూ వ్యాయామం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ యేడాదిలోనే ఇప్పటి వరకు 3వందల మడ్ రన్ పోటీలు జరిగాయి. బురదలో పరిగెట్టడం వల్ల ఫిట్‌నెస్ మాత్రమే కాదు...మానసిక ఉల్లాసం కూడా వస్తుందంటున్నారు మడ్ రన్ ప్రియులు.

Published Date : Friday, 7/10/2011 2:42 PM IST
Related Articles
Gallery