విటమిన్ టాబ్లెట్స్ అతిగా వాడకూడదు
.jpg)
* డాక్టర్ సలహాతోనే విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి
* వృద్ధ మహిళల ప్రాణాలు తీస్తోన్న విటమిన్
మాత్రలు మంచైనా..చెడైనా ...అతి ఏదైనా ప్రమాదమే. ఆరోగ్య విషయంలోనూ ఈ సూత్రం వర్తిస్తుంది. ముఖ్యంగా వృద్ధ మహిళలు హెల్త్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని అతి జాగ్రత్త పడితే ప్రాణాలే పోతాయని ఓ పరిశోధనలో తేలింది. విటిమిన్ టాబ్లెట్స్ వల్ల ఆరోగ్యానికి లాభాల కంటే ఎక్కువ నష్టాలే ఉన్నాయని ఓ పరిశోధనలో రుజువైంది.
వీటిని ఎక్కువగా వాడటం వల్ల వృద్ధ మహిళలు త్వరగా చనిపోయే ప్రమాదం ఉందట. అందుకే వృద్ధాప్యం రాకముందే శరీరంలో అవసరమైన విటమిన్స్ మోతాదు తగ్గకుండా జాగ్రత్తలు తీసు కోవాలంటున్నారు డాక్టర్లు. మల్టీ విటమిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ6, మెగ్నీషియం, జింక్, కాపర్ , ఐరన్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడటం మంచిది కాదని ఈ స్టడీలో తేలింది.
ఇరవై ఏళ్ల నుంచి విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్న ముప్పై ఎనిమిది వేల మంది అమెరికా మహిళలపై పరిశోధన చేసి ఈ విషయాన్ని బైటపెట్టారు. మిగతా విటమిన్ టాబ్లెట్స్‌తో పోలిస్తే ఐరన్ , కాల్షియం సప్లిమెంట్స్ వల్ల ప్రమాదం తక్కువగా ఉందంటున్నారు డాక్లర్లు . కానీ తమ సలహా లేకుండా వృద్ధాప్యంలో సొంత వైద్యం చేసుకోవడం మంచిది కాదంటున్నారు.
Published Date : Thursday, 13/10/2011 2:41 PM IST