13 రాం చరణ్, ఉపాసన వివాహ తేదీ ఖరారు
.jpg)
* జూన్ 13న హైదరాబాద్‌లో పెళ్లి
* స్వయంగా ప్రకటించిన అపోలో ప్రతాపరెడ్డి
* మెగా ఫ్యాన్స్ లో ఆనందోత్సాహం
* వివాహానికి భారీ ఏర్పాట్లు
* తిరుపతిలో రిసెప్షన్ కు ప్లాన్
* అరగొండలో చేయాలని అపోలో వారి అభిలాష
మెగా ఫ్యామిలీలో వివాహానికి ముహూర్తం ఫిక్సయింది. చిన్ననాటి స్నేహితురాలు ఉపాసన మెడలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ మూడు ముళ్లు వేసే ఘడియ ఆసన్నమైంది. జూన్ 13న ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేసి రాజధానిలో వైభవోపేతంగా పెళ్లి జరిపేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అటు వివాహానికి దీటుగా రిసెప్షన్ ను కూడా మెగా లెవల్లో ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు శుభవార్త .
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసనల వివాహ ముహూర్తం ఖరారైంది. ఈవార్తను స్వయంగా ఉపాసన తాతయ్య, అపోలో హాస్పటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తిరుమలలో ప్రకటించారు. కుటుంబ సభ్యులతో సహా శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. చెర్రీ, ఉపాసనల మ్యారేజ్ డేట్ ను ఎనౌన్స్ చేసారు. జూన్ 13న హైదరాబాద్లో వివాహాన్ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు పెద్దలు నిర్ణయించారని ప్రతాపరెడ్డి చెప్పారు. వివాహ ముహూర్తం గురించి తిరుమల అర్చకులతో కూడా ఆయన సంప్రదించారు.
పెళ్లి డేటు ఫిక్సయినా.. ఇంకా వేదిక, సమయం వెల్లడికాలేదు. దీనిని చిరంజీవి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివాహానికి కనీవినీ రీతిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన ప్రతాపరెడ్డి.. రిసెప్షన్ ను కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా చేస్తామన్నారు. చిరంజీవి సొంత నియోజక వర్గం తిరుపతిలో రిసెప్షన్ నిర్వహించాలని చిరు భావిస్తున్నారని.. ఐతే.. తమ స్వగ్రామమైన చిత్తూరు జిల్లా అరిగొండలో ఏర్పాటు చేయాలని చిరును కోరామని ఆయన చెప్పారు.
త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందన్నారు. గతేడాది డిసెంబర్ 1న కళ్లు చెదిరే సెట్టింగులు.. రంగు రంగుల పూలు.. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య రాంచరణ్ తేజ్, ఉపాసన ఎంగేజ్‌మెంట్ కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకకు అతిరథ మహారథులంతా తరలివచ్చి.. కొత్త జంటను ఆశీర్వదించారు. ఎంగేజ్ మెంటును తలదన్నేలా మెగా ఫ్యామిలీ ఇమేజ్ పెంచేలా.. వివాహ మహోత్సవాన్ని జరిపేందుకు అటు మెగా స్టార్, ఇటు అపోలో ఫ్యామిలీలు సన్నాహాలు చేస్తున్నాయి.
Published Date : Wednesday, 1/2/2012 3:57 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |