కొమరం పులిపై పెరుగుతున్న అంచనాలు
.jpg)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా కాలం గ్యాప్ తర్వాత నటించిన పులి సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన బాణీలు సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు..ఈ సినిమా ట్రైలర్లు ఇంటర్ నెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉన్న పవన్ కల్యాణ్ ఆహార్యం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భారీ వ్యయంతో.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మించినట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే ట్రైలర్ కూడా చాలా రిచ్ గా ఉంది. సినిమాను వచ్చే నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Published Date : Thursday, July 15, 2010 10:45 am IST
KOMARAM PULI TRAILER
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


