టాలివుడ్‌లో మొదలైన పెళ్ళి సందడి ?

శ్రావణమాసం మొదలయ్యింది. టాలివుడ్‌లో పెళ్ళి సందడి కూడా మొదలయ్యింది..!
టాలివుడ్‌లో అమ్మాయిల హార్ట్ బీట్స్‌గా నిలిచిన యంగ్ హీరోస్ పెళ్ళి కొడుకులు కాబోతున్నారట ? ఈ పెళ్ళికొడుకుల లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారో చూద్దామా...
ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ సత్తాను చాటుకుంటున్న యంగ్ హీరోస్‌కి అప్పుడే పెళ్ళట.
ఆ మధ్య జూనియర్ ఎన్‌టిఆర్ నిశ్చితార్థం అయిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఈ యంగ్ టైగర్‌కి త్వరలోనే పెళ్ళి కాబోతోంది. అయితే ఈ లిస్ట్‌లోకి తాజాగా మరో ఇద్దరు హీరోలు చేరారండి. ఒకరు స్టైలిష్ స్టార్ అయితే మరొకరు మెగాపవర్‌స్టార్..! టాలివుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తన కుటుంబ సభ్యులతో ఈమధ్యనే పెళ్ళిచూపులకు అటెండ్ అయ్యారట. కాని ఆ వధువు వివరాలు మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచుతున్నారు ఈ వరుడు.
అలాగే చిరు కూడా చరణ్‌కి పెళ్ళి చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిసింది. కాని ఈ విషయాలు ఏవీ బయటపెట్టడం లేదు. అయితే అల్లుఅర్జున్ పెళ్ళి అనౌన్స్ మెంట్ తరువాత రామ్ చరణ్ మారేజ్ అనౌన్స్ మెంట్ ఉంటుందని టాలివుడ్ టాక్. అయితే ఇది లవ్ మారేజా.. లేక అరేంజ్‌డ్ మారేజా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఎందుకంటే ఇంతక ముందు చరణ్‌కి ఓ హీరోయిన్‌తో డీప్ లవ్ అఫైర్ ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సో ఈ హీరోల లైఫ్‌లో హీరోయిన్స్ ఎవరో తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే..!
Published Date : Wednesday, Aug 18, 01:40pm IST
Watch Video....
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


