శంకర్‌కు ‘రోబో’ను ఇచ్చిన షారుక్ ఖాన్!

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘శివాజీ’ చిత్రం తర్వాత రూపొందిన చిత్రం ‘రోబో’. ఐశ్వర్యరాయ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అతి త్వరలో విడుదలకానుంది. కాగా ఈ చిత్రాన్ని తొలుత షారుక్‌తో తీయాలని శంకర్ అనుకున్నాడు. కానీ షారుక్ ఒప్పుకోలేదు. అనంతరం రజనీకాంత్‌తో శంకర్ ఈ సినిమాను రూపొందించారు.
అయితే షారుక్ ఖాన్ తన రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై ఓ సినిమా తీయడానికి ‘రోబో’ అని టైటిల్ రిజిస్టర్ చేసాడు. రజనీకాంత్‌తో శంకర్ చేసిన ‘రోబో’ హిందీలో కూడా విడుదలవుతోంది కాబట్టి.. టైటిల్ పరమైన ఇబ్బంది నెలకొంటుందని శంకర్ భావించాడట. అందుకని టైటిల్ తమకు ఇచ్చేయాల్సిందిగా విన్నవించుకుంటూ షారుక్‌కి శంకర్ లెటర్ రాసాడు. ఈ దర్శకుడికి కోరిక మేరకు షారుక్ ‘రోబో’ టైటిల్‌ను ఇచ్చేసాడట.
Published Date : Sep 04, Saturday 02:50PM IST
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


