ముసలాడైనా ఓకే అంటున్న కమల్ కుమార్తె!

కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ తండ్రి బాటలో పయనిస్తున్నట్లు కనబడుతోంది. విలక్షణ నటిగా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది. కుర్ర హీరోలు, సీనియర్ నటులతోపాటు అవసరమైతే వృద్ధ నటులతో కూడా నటిస్తానని చెపుతోందట. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో మహా బిజీగా ఉన్న ఈ తార యువహీరో సిద్ధార్ద్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. పనిలోపనిగా షూటింగ్ మధ్యలో తెలుగు భాషను నేర్చుకునేందుకు కసరత్తు చేస్తోందట. తెలుగు భాషను నేర్చుకోవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి కొందరు యువహీరోలు శృతికి అప్పుడప్పుడు తెలుగు భాషపై క్లాసులు తీసుకుంటున్నారట. యువహీరోల తెలుగు భాష బోధనతో శృతికి తెలుగుపై త్వరలోనే పట్టు సాధించేస్తుందని టాలీవుడ్ సినీజనం అంటున్నారు.
Published Date : Monday, Sep 6, 11:17am IST
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


