ప్రారంభమైన ‘అదినువ్వే’ కాంటెస్ట్!

కొత్తగా విడుదలయ్యే చిత్రాలకు సరికొత్త కాంటెస్ట్‌లను నిర్వహిస్తున్నారు. సినిమాను బట్టి నగర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు విభిన్నంగా ప్రమోషన్‌లు జరుగుతున్నాయి. సినీ ప్రియులను మరింత చేరువయ్యేందుకు కాంటెస్ట్‌లతో బహుమతులను అందిస్తూ, నటులను కలుసుకునే అవకాశాన్ని కలిగిస్తున్నారు చిత్ర దర్శకనిర్మాతలు. ఇదే తరహాలో చైతన్య హీరోగా, అక్ష హీరోయిన్‌గా శ్రీకాంత్ దర్శకత్వంలో వీరప్రసాద్ నీలం నిర్మించిన ‘అది నువ్వే’ చిత్రానికి సంబంధించిన ఓ కాంటెస్ట్‌ను ప్రారంభించారు. ఈ కాంటెస్ట్‌లో విజేతలకు ‘అదినువ్వే’ సినిమాలో నటించిన వారితో కలసి డిన్నర్ చేసే అవకాశాన్ని కల్పించడంతో పాటు ప్రీమియర్ షో టికెట్లను అందజేస్తున్నారు.
Published Date : Monday, Sep 6, 11:45am IST
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


