Rating : 3 / 5
Star Cast : సిద్ధార్థ్, ప్రణీత, రాజేంద్రప్రసాద్, సింధూ తులానీ, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, అలీ, ఆహుతి ప్రసాద్ తదితరులు.
Directed by : రాంబాబు
Produced by : ఎం,ఎల్. పద్మకుమార్ చౌదరి
Gist :
కథ : గోదావరి జిల్లాలోని వెంకటాపురం గ్రామంలో తుంటరి పనులు చేసే వీరబాబు(సిద్ధార్థ్) వరలక్ష్మి(ప్రణీత) ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను పొందే ప్రయత్నం చేస్తూనే వాళ్ళిద్దరూ చిన్నప్పుడు సంగతులను గుర్తు చేస్తాడు. ఎంతో కాలంగా ఆ జ్ఞాపకాలతో ఉన్న వరలక్ష్మి కూడా వీరాబాబును ప్రేమిస్తుంది. కానీ వరలక్ష్మి ఇంట్లో వారు తన బావతో పెళ్లి నిశ్చయిస్తారు. ఈ పరిస్థితులను ఎదుర్కొని వీరిద్దరూ కన్నవారిని నొప్పించకుండా ప్రేమను గెలుచుకునే ప్రయత్నంలో ఉండే మలుపులతో ఈ చిత్ర కథాంశం సాగుతుంది.
తారాగణ తీరు :
లవర్ బాయ్ ఇమేజ్తో క్లాస్ మూవీస్ చేసే కలిగిన సిద్ధార్థ్ తొలిసారిగా ఒక పల్లెటూరి యువకుడిగా మంచి నటనను ప్రదర్శించాడు. తొలిసారి అయినప్పటికీ తన ఇమేజ్కి దూరంగా గోదావరి యాసతో కూడా ప్రేక్షకులను అలరించాడు. ప్రణీత తన అందంతో అభినయంతో ఒక తెలుగింటి అల్లరి పిల్లగా మంచి నటనను కనబరిచింది. రాజేంద్ర ప్రసాద్ తండ్రిగా తన పాత్రకు న్యాయం చేశారు. బ్రహ్మానందం, అలీ ఉన్న ఒకటి రెండు సన్నివేశాల్లో అంతగా నవ్వుల పువ్వులు పూయించలేకపోయారు.
దర్శకత్వం :
దర్శకుడు రాంబాబు తన తొలిచిత్రానికి మంచి కుటుంబ కథను ఎంపిక చేసుకోవడమే కాక ప్రేమలో మునిగిన యువత కుటుంబాలకు దూరమయ్యి ఎం పోగొట్టుకుంటున్నారనే దానిని చక్కగా తెరకెక్కించారు.
సంగీతం : సంగీత దర్శకుడు చక్రి ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించినప్పటికీ క్లైమ్యాక్స్ సన్నివేశాల్లో మంచి సంగీతాన్ని సమకూర్చారు. ప్రత్యేకతలు : ప్రణీత నటన, సినిమాటోగ్రఫీ మరియు గోదావరి అందాలు, ప్రాంతీయత చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.
క్లుప్తంగా : చిత్ర ప్రధమార్ధం చక్కని సన్నివేశాలతో అందర్నీ అలరిస్తుంది. కుటుంబ కథతో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ అందర్నీ ఆకర్షించకపోయినా ఫ్యామిలీ ఎంటర్‌టేనర్ గా మంచి ఆదరణ పొందుతుంది.
|