Rating : 4 / 5
Star Cast : రామ్ చరణ్ తేజ్, జెనీలియా, షాజహాన్ పదమ్సీ, బ్రహ్మానందం, ప్రభు, నాగబాబు, మంజుల, సంజయ్ స్వరూప్, సంచిత షెట్టి, మధురిమ, వెన్నెల కిషోర్ తదితరులు
Directed by : భాస్కర్
Produced by : నాగబాబు
Gist : సముద్రమంత "ప్రేమ" కావాలి
కథ : రామ్ (రామ్ చరణ్) ఆస్ట్రేలియలో అక్క, బావలతొ కలిసి నివసిస్తుంటాడు. ప్రేమ అన్నా ప్రేమించే వాళ్ళన్నా కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు ఉన్న రామ్ జానూ(జెనీలియా)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇది వరకే ఎంతో మందిని ప్రేమించి కాలంతో పాటు ప్రేమ కూడా కరిగిపోతుందనుకునే రామ్, జానూ తనను ఇష్టపడడం ప్రారంభించాక ప్రేమ పై తన అభిప్రాయాలను మార్చుకోలేక ప్రేయసికి చేరువ కాలేక తను ఇటువంటి పరిస్తితులను ఏ రకంగా అధిగమిస్తాడు అనేది తెర పై చూసి ఆస్వాదించాల్సిందే.
తారాగణ తీరు :
మగధీర చిత్రంతో తన మార్కెట్ ను తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పిన రామ్ చరణ్ తొలి సారిగా లవర్ బాయ్ గా తెలుగు హృదయాలను దోచుకునే ప్రయత్నం చేశాడు. తన యూత్‌ఫుల్ ఎనర్జీటిక్ యాక్షన్ తో ప్రేక్షకులని అబ్బురపరిచాడు. ఇక కథానాయిక జెనీలియా తన నిత్యనూతన వైవిధ్యమైన నటనతో చిలిపి అమ్మాయిగాను అవసరమైన సన్నివేశాల్లో అభినయంతోనూ అలరించింది. మరో కథానాయిక షాజహాన్ పదమ్సీ తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తూనే చిన్న పాత్రలో చక్కగా నటించింది.
దర్శకత్వం :
భాస్కర్ తెరకెక్కించిన ఆరెంజ్ కధ ప్రేమ అనే లోకంలో ఒక కొత్త కోణంగా చెప్పచ్చు. మంచి కధాంశంతో రూపొందిన ఈ చిత్రం భాస్కర్ కి మరో మారు మంచి పేరును గుర్తింపును తెస్తుంది. ఎంతో సున్నితమైన కథను ఎంచుకున్నా ఎంతో చక్కగా తెరక్కెకించడంలో విజయం సాధించారు.
సంగీతం : హరీశ్ జైరాజ్ సంగీతానందించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు ప్రేక్షకుల హృదయానికి చేరువ కావడమే కాకుండా తాను అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూసిక్ కూడా చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేసింది. ప్రత్యేకతలు : రామ్ చరణ్ స్టైలిష్ లుక్ మరియు తన అద్భుతమైన నటన, జైరాజ్ సంగీతం, పాటలు, కథలో అంతర్లీనమైన ఎంటర్‌టేన్‌మెంట్ ఈ చిత్రానికి హై లైట్ గా నిలుస్తాయి.
క్లుప్తంగా : రామ్ చరణ్ అభిమానులను మెగా తమ్ముళ్లను ఆనందోత్సాహల్లో ముంచే ఈ చిత్రం రామ్ చరణ్ మునుపటి చిత్రం అంతటి విజయం సాధించకపోయినా ఈ సంవత్సరం విడుదలైన అతి కొద్ది హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది.
|