Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
రక్త చరిత్ర - 2 Telugu Movie Review
Rating : 2.5 / 5
Star Cast : సూర్య, ప్రియమణి, వివేక్ ఒబెరాయ్, సుదీప్, రాధిక ఆప్తే, శత్రుఘ్న సిన్హా, శుభలేక సుధాకర్ తదితరులు
Directed by : రామ్ గోపాల్ వర్మ
Produced by : మధు మంతెన
Gist : పరిస్థితుల చరిత్ర
కథ :

రక్తచరిత్ర మొదటి భాగంలో ఎం జరిగిందో తెలుపుతూ మొదలయ్యే ఈ చిత్రం ప్రతాప్ రవి(వివేక్) చంపిన ఎమ్మెల్యే నరసింహ రెడ్డి కొడుకు సూర్య(సూర్య) ప్రతాప్ పై పగ ఎలా తీర్చుకుంటాడనే కథ. ఆనందపురం నుండి దూరంగా కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తూ ప్రశాంత జీవితం గడుపుతున్న సూర్య ఆనందపురం గోడవల్లో ప్రతాప్ చేతిలో తన తండ్రినే కాకుండా తన కుటుంబం మొత్తాన్ని కోల్పోవడంతో పగతో రగిలిపోతూ ఎలాగైనా ప్రతాప్ ను అంతం చేయడమే జీవిత ధ్యేయంగా మార్చుకుంటాడు. ఈ నేపధ్యంలో తన పగను ఎలా తీర్చుకున్నాడో... ఎటువంటి పరిస్థితులు ప్రతాప్ ని, సూర్య ని ఎలా మార్చయనేది తెరపై చూడాల్సిందే.

తారాగణ తీరు :

సూర్య పాత్రలో నటించిన నటుడు సూర్య అద్భుతమైన నటనను కనబరిచారు. ప్రతాప్ రవిగా నటుడు వివేక్ కూడా అందరినీ తన నటనతో ఆకట్టుకున్నారు. భవానిగా నటించిన ప్రియమణి తన పాత్ర చిన్నదైనప్పటికీ ఆమె పాత్రకు తగినంత న్యాయం చేశారు. ఇక రాధిక ఆప్తే రెండవ భాగంలో రెండు, మూడు సన్నివేశాలకు పరిమితమైనప్పటికీ ఆమె నతానసైలి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ పోలీస్ పాత్రలో వర్మ దర్శకత్వానికి తగ్గ నటుడిగా ఎంతో చక్కగా నటించారు.

దర్శకత్వం :

వైవిధ్య వివాద దర్శకునిగా పేరు పొందిన రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర - 2 చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. సాధారణంగా తన దర్శకత్వంలో ఉండే అన్ని హంగులతో ఉన్నప్పటికీ ఏ పాత్రను ఎక్కువ తక్కువ చేయకూడదని, ఈ చిత్రంలో కథకు న్యాయం చేసే యోచనలో ఆయన సినిమాకు న్యాయం చేయలేకపోయారు. మొదటి భాగం హిట్ తరువాత రెండవ భాగం ఎలా ఉండబోతుందా అని ఎదురుచుసిన ప్రేక్షకులకు నిరాశే మిగిల్చారు.
సంగీతం : ధరం - సందీప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశానికి తగినట్టుగా ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ చిత్రంలో పాటల కన్నా బ్యాక్ గ్రౌండ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ అంచనాలకు ఏ మాత్రం తీసీపోకుండా మంచి సంగీతాన్ని అందించారు.
ప్రత్యేకతలు : రామ్ గోపాల్ వర్మ ఎంచుకున్న కథే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. నటులు సూర్య, సుదీప్, వివేక్ ల నటనా శైలి ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

క్లుప్తంగా : మామూలుగానే అందరినీ ఆకర్షించలేని చిత్రాలు తీసే వర్మ తన చిత్రాలను ఆదరించే కొద్ది మందిని కూడా అలరించలేకపోయారు. చిత్ర ద్వితీయార్ధంలో ఎక్కువ సెంటిమెంట్ మేళవించి కథను చక్కని రీతిలో చెప్పలేకపోయిన చివరికి ఫ్యాక్షనిస్ట్ లంతా పరిస్థితుల వల్ల అలా అయ్యారని చెప్పే ప్రయత్నం చేశాడు.

Rating: 1.0/5 (3 votes cast)
SocialTwist Tell-a-Friend
Movie Reviews

Tags
Raktha Charitra 2 review, Telugu Movie Review, Raktha Charitra 2 Telugu Review, Ram Gopal Varma Raktha Charitra 2 Review