Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Dhada Telugu Movie Review
Rating : 2 / 5
Star Cast : నాగ చైతన్య, కాజల్, శ్రీ రామ్, బ్రహ్మానందం, ముకేష్ రుషి, కెల్లి డార్జ్, రాహుల్ దేవ్, అలీ, వేణు మాధవ్, ఎం. ఎస్. నారాయణ తదితరులు.
Directed by : అజయ్ భుయాన్
Produced by : డి. శివప్రసాద్ రెడ్డి
Gist :
కథ :

అన్నయ్య రాజీవ్ (శ్రీ రామ్) వదిన (సమీక్ష)లతో కలిసి ఉంటూ అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేసి తిరిగి ఇండియా వచ్చేద్దామనుకునే యువకుడు విశ్వ(నాగ చైతన్య) అత్యంత ధనవంతుడు ముకేష్ రుషి కూతురు రియా (కాజల్)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తను చేసిన సహాయమే తన ప్రాణానికి తన కుటుంబానికి ముప్పుగా మారిన పరిస్థితుల్లో విశ్వ ఆ పరిస్తితులను ఎలా ఎదుర్కున్నాడు... తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడనే కథాంశంతో సాగే చిత్రమిది.

తారాగణ తీరు :

తొలిసారి మాస్ చిత్రంతో ముందుకొచ్చిన చైతన్య ప్రేక్షకుల మన్ననలు పొందడంలో పూర్తిగా విఫలమయ్యాడు. డాన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆకట్టుకోలేకపోయాడు. ఎక్కువ సన్నివేశాలు మంచి నటన కనబరిచే ఆవకాశం లేనప్పటికీ కాజల్ ఇంకొంత అందంగా కనిపించుంటే బాగుండేది. బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్, ఎం. ఎస్. నారాయణ వంటి పెద్ద పెద్ద హాస్య నటులు ఉన్నప్పటికీ ప్రేక్షకులకు నవ్వించడంలో పూర్తిగా విఫలమయ్యారు. అన్నగా శ్రీ రామ్ తన పాత్రకు పూర్తీ న్యాయం చేసాడు.

దర్శకత్వం :

ఎన్నో ఆశలతో అంచనాలతో సిని జీవితం ప్రారంభించిన నూతన దర్శకుడు అజయ్ భుయాన్ తన తొలి ప్రయత్నంలోనే అపజయం రుచి చూడక తప్పలేదు. తను ఎంచుకున్న కథ, తెరకెక్కించిన విదానం ఏ రకమైన ప్రేక్షకులను కూడా అలరించలేనివి. అనవసరమైన ఖర్చుతో తెరకెక్కించి తెలుగు పరిశ్రమకు మరో ఫ్లాప్ అందించారు.
సంగీతం : ఎప్పుడు మంచి బాణీలతో మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించే దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ సారి పూర్తీ స్థాయి ప్రతిభ కనబర్చలేదనే చెప్పాలి.
ప్రత్యేకతలు : చెప్పుకోవడానికి ఏమి లేకపోవడమే ఈ చిత్ర్రానికి ప్రత్యేకత.

క్లుప్తంగా : అక్కినేని ఫ్యామిలీ వీరాభిమానులు కూడా జీర్ణించుకోలేని సినిమా.

Rating: 1.0/5 (2 votes cast)
SocialTwist Tell-a-Friend
Movie Reviews

Tags
Dhada telugu Movie Review, Naga chaitanya Dhada Movie Review, Dhada Movie Review in Telugu, Telugu Movie Reviews