Rating : 3.5 / 5
Star Cast : రామ్, హన్సిక, అక్ష, సోను సూద్, కలర్స్ స్వాతి, చంద్ర మోహన్, జయప్రకాశ్ రెడ్డి, రఘు బాబు, బ్రహ్మాజీ తదితరులు...
Directed by : సంతోష్ శ్రీనివాస్
Produced by : బెల్లంకొండ సురేష్
Gist : A B C D E F శీను గాడు చాలా Tough
కథ : అనకాపల్లిలో తన పెళ్లి అయ్యే వరకు ఎవరి పెళ్లి అవ్వకూడదని పెళ్లి కుత్రులని తీసుకొచ్చేసే శీను గాడు (రామ్) చదువు లేదని మరదలు పెళ్లి చేస్కోననడంతో డిగ్రీ పూర్తిచేసేందుకు హైదరాబాద్ వచ్చి కాలేజిలో చదివే శృతి(హన్సిక)తో ప్రేమలో పడతాడు. అప్పటికే శృతిని ప్రేమిస్తూ ఎవరు కన్నేతి కూడా చూడనివ్వని భవాని(సోను సూద్)ని ఎదిరించి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? తనకు తెలీకుండానే తనను ప్రేమిస్తున్న వరంగల్ రాజన్న(జయప్రకాశ్ రెడ్డి) కూతురు సంధ్య (అక్ష) నుండి ఎలా దూరం అయ్యి శ్రుతిని గెలుచుకున్నాడో తెరపై చూసి తెలుకోవాల్సిందే...
తారాగణ తీరు :
చలాకీగా అల్లరి చేస్తూ ఉండే తెలివైన కుర్రాడి పాత్రలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎంతో జోష్ తో నటించాడు. తన ఎనర్జిటిక్ యాక్షన్ తో సినిమాకి మరింత ఎనర్జిని అందించాడు. మధ్య తరగతి కుటుంబంలో పెరిగిన అందమైన తెలుగింటి ఆడపిల్ల పాత్రలో హన్సిక చక్కటి నటనతో అభినయంతో ఆకట్టుకుంది. కొద్దిగా లావు అయిన బొద్దుగా మాస్ ప్రేక్షకులను అలరిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణా ప్రాంతానికే రారాజుగా పేరుపొందిన వరంగల్ రాజన్న గారాల కూతురిగా తెలంగాణా యాసతో అక్ష మంచి నటనను ప్రదర్శించింది. ఎప్పుడు సీరియస్ విలన్ గా కనిపించే సోను సూద్ ఒక కొత్త పాత్రలో వినూత్నంగా నటించాడు. చంద్ర మోహన్, రఘు బాబు తదితరులు తక్కువ సన్నివేశాల్లో ఉన్నప్పటికీ ప్రేక్షకులను కడుప్పుబా నవ్వించారు.
దర్శకత్వం :
సూపర్ హిట్ చిత్రానికి సూపర్ డైరెక్టర్ ప్రాముఖ్యత ఎంత అనేది నూతన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెలియజేసారు. అద్భుతమైన కథ కథనంతో ప్రేక్షకులు సంతృప్తి పరిచేలా చిత్రాన్ని తెరకెక్కించాడు. నూతన దర్శకుడు అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న వాడిలా సినిమా తీసాడనడం అతిశయోక్తి కాదు.
సంగీతం : తనదైన శైలిలో మంచి పాటలతో సరైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో తమన్ తన వంతు కృషి చేసాడు. ప్రత్యేకతలు : కథ, కథనం, దర్సకత్వం...రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కామెడి వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న మంచి చిత్రం.
క్లుప్తంగా : అందర్నీ అలరించే ఈ చిత్రం అందరూ చూసి ఆనదించాలి.
|